Burning Topic: ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది చూపిస్తే ఇలాగే ఉంటుంది
Burning Topic: సోషల్ మీడియాలో హోమ్ టూర్ల పేరుతో తన సంపదను చూపించుకున్న యూట్యూబర్ ఇంట్లో దొంగతనం జరిగింది.
Burning Topic: ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది చూపిస్తే ఇలాగే ఉంటుంది
Burning Topic: సోషల్ మీడియా వచ్చాక వీడియోలు, రీల్స్, సెల్ఫీలు తీయడం.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం.. లైక్స్, వ్యూస్ చూసుకొని మురిసిపోవడం ఆనవాయితీగా మారిపోయింది. కొందరు వీడియో వ్లాగర్స్ అయితే అసలు ఏం చూపించాలో, ఏవి వద్దో అనే విచక్షణ లేకుండా హోం టూర్‌ల పేరుతో ఇంటి గుట్టు బయట పెట్టుకుంటున్నారు. తమ వ్యక్తిగత విషయాలను, సంపద అతిగా ప్రదర్శించుకోవడం అలవాలైపోయింది. మధ్యప్రదేశ్, శివపురిలోని మోహిని ఖ్యావదా గ్రామానికి చెందిన గృహిణి రచనా గుర్జర్ ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది. ఆమెకు యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తమ ఆడంబర జీవితంతో పాటు ఇంటి గురుంచి, ఆస్తులు, వ్యాపారాల గురుంచి గొప్పలకు పోవడం అలవాటైపోయింది. తాను కొత్తగా కొన్న నగలూ, తన దగ్గర ఉన్న కలెక్షన్ చూపించడం, వాటి గురుంచి ఎంతో గొప్పగా చెప్పడం ఆమెకు ఎంతో ఆందాన్ని కలిగించే విషయం.
ఈ క్రమంలోనే రచనా గుజ్జర్ అనేక సార్లు తన నగలను వీడియోలుగా తీసి అప్‌లోడ్ చేసింది. ఒక వీడియోలో ఇంటి గేట్ నుంచి ఇంట్లో ఉన్న రూముల వరకు చూపించారు. తమ ఇంటో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీకెమెరాలు, ప్రహరీ గోడ మీద ఏర్పాటు చేసిన ఇనుప కంచె, రక్షణ వ్యవస్థల గురుంచి కూడా గొప్పగా చెప్పకుంది రచనా గుజ్జర్ఇటీవల తన ఇంటిని చూపిస్తూ హోమ్ టూర్ చేశారు. అందులో, ఇంట్లో ఉన్న డబ్బును, బంగారు, వెండి నగలను సైతం చక్కగా లేబుల్ మీద పరిచి మరీ చూపించారు. కొద్ది రోజుల క్రితమే తన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒంటి నిండా భారీ గోల్డ్ జ్యువెలరీ వేసుకుని, మురిసిపోతూ ఒక వీడియో పోస్ట్ చేసింది.
నా దగ్గర ఇన్ని తులాల బంగారం ఉంది, ఇన్ని లక్షల క్యాష్ ఉంది' అని ఫోజులిస్తే ఆ రీల్స్ చూసి లైకులు కొట్టేది కేవలం ఫాలోవర్లు మాత్రమే కాదు.. అవకాశం కోసం ఎదురుచూసే దొంగలు కూడా ఉంటారు. ఇంటి విషయాలను, ఆస్తులు, నగదూ, నట్రా విశేషాలను పూసగుచ్చినట్లు వివరంగా చెప్పిన తర్వాత దొంగలకు కన్ను కుట్టకుండా ఉంటుందా? ఇంకేముంది రచనా గుజ్జర్ ఇళ్లు ఎక్కడుందో దొంగలు ఈజీగా తెలుసుకున్నారు. ఇంట్లో ఎక్కడ ఏముందో ఆమె చక్కగా వివరించడంతో పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. అర్థరాత్రి దాటాక రచనా గుజ్జర్ఇంటి వెనుక వైపు నుంచి దాదాపు 8 అడుగుల ఎత్తైన కాంపౌండ్‌పై ఉన్న ఫెన్సింగ్ వైర్లను కట్‌చేసి, లోపలికి చొరబడ్డారు. ఆ సమయంలో రచన, ఆమె కుటుంబ సభ్యులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. ఆ గదికి బయటి నుంచి గడియపెట్టారు. ఆ తర్వాత కింది అంతస్తులోని గదిలో ఉన్న అల్మారాను పగలగొట్టి అంతా దోచేశారు.
రచనా భర్త ఉదల్ సింగ్ గుజ్జర్ అర్ధరాత్రి దాటాక 2:30 గంటల సమయంలో నీళ్లు తాగడానికి లేచారు. తెలుపు తీయడానికి ప్రయత్నిస్తే అది రాకపోవడంతో బయటి నుంచి గొళ్లెం వేసినట్లు అర్థమైపోయింది. అనుమానంతో మొబైల్ఫోన్లో సీసీటీవీ కెమెరా ఫుటేజీని చెక్ చేశారు. అయితే దొంగలు ఎంతో తెలివిగా ఎలాంటి దృశ్యాలు రికార్డు కాకుండా ఆ సీసీటీవీ కెమెరాలను పైకి తిప్పేశారు. ఉదల్ సింగ్ వెంటనే తన సోదరునికి ఫోన్ చేసి రప్పించారు. ఆయన వచ్చేసరికి మెయిల్ గేటు కూడా లోపలి నుంచి లాక్ చేసి ఉంది. చివరకు కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి వచ్చి గేటు తీయడంతో ఇంటోని వారు బయటకు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడతో వారు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కాగా తన ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని కూడా రచనా గుజ్జర్ వీడియో తీసి అప్‌లోడ్ చేయడం విశేషం.
రచనా గుజ్జర్ ఇంట్లో చోరీకి గురైన సంపద విలువ దాదాపు 7 నుంచి 8 లక్షల దాకా ఉంటుందని అంచనా. దొంగలు రచన ఇంట్లోని బుల్ డ్రింక్బాటిళ్లను కూడా వదల్లేదు. ఏకంగా 27 క్యాన్లను తీసుకెళ్లారు. పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తాం అని పోలీసు అధికారులు తెలిపారు. రచనా గుర్జర్ మొదటి నుంచి సోషల్ మీడియాలో తన లగ్జరీ లైఫ్ స్టయిల్‌ను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తుంటారని పోలీసులు తెలిపారు. ఇవన్నీ క్రమం తప్పకుండా ఫాలో అయిన దొంగలు పక్కా స్కెట్ వేసి చోరీ చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. దొంగలు స్థానికులు లేదా చుట్టుపక్కల ప్రాంతానికి చెందినవారై ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వీడియో వ్లాగర్స్ తన వ్యక్తిగత విషయాలు, ఆస్తుల గురించి ఇలా వీడియోలు తీసి గొప్పలకు పోవడం దొంగల చేతికి స్వయంగా తాళం చేతులు ఇవ్వడం లాంటిదేనని గ్రహిస్తే మంచిది.




