Jordar Varthalu: ఈ పెళ్లి కార్డు చూస్తే జీవితంలో మర్చిపోరు
Jordar Varthalu: వివాహ ఆహ్వాన పత్రికలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఖమ్మం కానిస్టేబుల్ వినూత్న ఆలోచన.
Jordar Varthalu: ఈ పెళ్లి కార్డు చూస్తే జీవితంలో మర్చిపోరు
Jordar Varthalu: వారెవ్వా.. అన్న ఆలోశన మామూలుగ లేదు గదా. సైబర్ దొంగలకు శిక్కద్దని పోలీసన్నలు క్యాంపులు వెట్టి శెప్తె ఎవ్వలు పట్టిచ్చుకుంటరు. మనం దొర్కుతమా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోని లైట్ తీసుకుంటరు. అవన్ని మాకు గాదన్నట్టే.. కామన్గ ఫీలైతరు. మరి అందరికి గాకున్నా, దగ్గరోల్లకు కొంత మందికన్నా మంచి జర్గుతదనే మంచి ఆలోశనతోని లగ్గం కార్డుతోనే ప్రశారం ఛాల్జేశిండు ఖమ్మం దిక్కు గీ పోలీసన్న. అక్కడి టూటౌన్ల హెడ్ కానిస్టేబుల్ కొల్వుజేస్తున్న బోనగిరి నాగేశ్వర్ రావు.. బిడ్డెకు లగ్గం కాయమైందట. ఇగ అన్న అందరిలెక్క ఉత్తత్త పెండ్లి పత్రికల్తోని ఆహ్వానం పల్కకుంట.. సైబర్ నేరాల మీద అవగాహన కల్పిచ్చుకుంట లగ్గానికి ఆహ్వానాలందిస్తున్నడు. అందరిలెక్కనే పిల్లాపిలగాని పేర్లు, ఇంట్లోల్ల పేర్లు, లగ్గం ఏ యాల్లకు, ఎక్కడ అయితున్నదో రాపిచ్చిండు. అటెంక, సైబర్ నేరాల మీద అవగాహనే మీకు రక్ష అని రాపిచ్చి.. సైబర్ దొంగలకు చిక్కకుంట ఏమేం జెయ్యాల్నో ఆరు సూత్రాలు రాశి పెట్టిండు.
దాంట్ల.. అచ్చిరాని లింకులొత్తి ఆగం కావద్దని, ఉద్దెర గిఫ్టుల కోసం ఆశపడద్దని, మీ పేర్మీద పార్సలచ్చిందని ఫోన్లు జేశెటోల్లను ఉత్తగ నమ్మి బోర్లవడద్దని, మీ బ్యాంకు ఖాతా యాక్టివేట్ అయింది సూస్కోర్రని, పొద్దుమాపు ఇది పాటిస్తె మీ జీవితం ఫ్లడ్ లైట్ లెక్క ఎల్గుతదని ఎవ్వలన్న ఫోన్లు జేస్తే ఆగంకావద్దని రాసుకచ్చిండు. ఫ్రీ వైఫైలున్న కాడ ఫోన్లొత్తెటప్పుడు జర్రంత పైలంగుండాల్నని కుద్దుగ జెప్పిండు. ఇగీ పత్రిక ఇంటర్నెట్ల మస్తు వైరలైంది. అన్న ఆలోచన తోపనుకుంట తారీఫ్ జేస్తున్నరు ఇంటర్నెట్ జనాలు. ఏదో డ్యూటీ జేశ్నమా ఇడ్శిపెట్టినమా అని శానామంది అనుకుంటరు. కనీ., అట్లగాకుంట.. ఆహ్వానాలతోని సుతం అవగాహన కల్పించవచ్చని జేశ్న నీ ఆలోశనకు శెనార్తులే అన్న. ఇది ఇట్లుంటే.. రాజస్తాన్లైనా లగ్గంల పక్షిజాతి దూపతీర్శే పన్జేశిర్రు.
పక్షిజాతి దూపన్నరు. కొత్త జంట ఒక్క శిప్పల నీళ్లు పోత్తెనే, దూప తీర్తదా అని గరానికి రాకుర్రి. ఒక్కటి కాదు రెండు కాదు.. ఐదువందల శిప్పలను మేనకోడలికి కట్నంగిచ్చి పక్షిజాతి దూపతీర్శే పని ముంగటేసుకున్నడు రాజస్తాన్ దిక్కు ఒగ మేనమామ. నర్పత్ సింగ్ రాజ్ పురోహిత్ అనెటాయ్న పర్యావరణాన్ని పచ్చంగుంచాల్నని ప్రమోశన్లు జేశి గ్రీన్ మ్యాన్ గా పేరెల్లిండట. ఇగాయ్న పక్షుల దూపతీర్వాల్నని బగ్గ ఆలోశన జేశి, మేనకోడలు లగ్గంల ఆమెకు కట్నంగ 5వందల మట్టిశిప్పలను సద్విచ్చుకున్నడు. ఇంకా లగ్గానికచ్చిన సుట్టాలతోని సుతం, తప్పకుంట పశుపక్షాదులకు నీళ్లు పోత్తమని ప్రమాణం చేపిచ్చిండు. ఇగీ ముచ్చట వార్తలల్ల సూశి.. మరో పక్షిరాజా అనుకుంట అన్నను మస్తు తారీఫ్ జేస్తున్నరు.




