AP PULSE: విశాఖకు కొత్త దశ.. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క! - విశ్లేషకుడు తురగా శ్రీరామ్
AP PULSE: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థల రాకతో నగరం కొత్త దశకు చేరుకుంటోందని విశ్లేషకుడు తురగా శ్రీరామ్ తెలిపారు.
AP PULSE: విశాఖకు కొత్త దశ.. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క! - విశ్లేషకుడు తురగా శ్రీరామ్
AP PULSE: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వాణిజ్య రాజధాని అయిన విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని, నగరం ఒక కొత్త అభివృద్ధి దశలోకి అడుగుపెడుతోందని ప్రముఖ విశ్లేషకుడు తురగా శ్రీరామ్ తెలిపారు. hmtv 'ఏపీ పల్స్' ప్రత్యేక కార్యక్రమంలో ఆయన విశాఖ భవిష్యత్తు, నగరంలో వస్తున్న అనూహ్య మార్పులపై స్పష్టమైన విశ్లేషణ అందించారు. ఇప్పటివరకు విశాఖ అభివృద్ధి ఒక లెక్క అయితే, రాబోయే రోజుల్లో జరిగే ప్రగతి మరో లెక్కలా ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు.
గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖకు వస్తుండటంతో నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వస్తోందని తురగా శ్రీరామ్ తెలిపారు. గతంలో ఐటీ హబ్ ఏర్పాటు ప్రయత్నాలలో ఆశించిన స్పందన రాలేదని, కానీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రాకతో మిగతా కంపెనీలు కూడా విశాఖ వైపు క్యూ కడుతున్నాయని చెప్పారు. రోడ్డు, జల, వాయు మార్గాల అనుసంధానంతో పాటు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం నగర అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు.




