Off The Record: మాజీ మంత్రి అండతో ప్రభుత్వ భూమి కబ్జా
Off The Record: విశాఖపట్నంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా ఉదంతం కలకలం రేపుతోంది.
Off The Record: మాజీ మంత్రి అండతో ప్రభుత్వ భూమి కబ్జా
Off The Record: విశాఖలో అది ఖరీదైన ప్రాంతం. ఎకరం కోట్లలో పలికే బంగారం లాంటి ప్రభుత్వ భూమి. ఇంకేముంది దర్జాగా..కబ్జా గద్దలు వాలిపోయాయి. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి ఆధ్వర్యంలో సర్కార్ ల్యాండ్ ఆక్రమణకు కథా, స్క్రిన్‌ప్లే నడిచింది. అతనికి కొందరు రెవెన్యూ, సర్వే అధికారులూ సహకరించారు. దీంతో ప్రభుత్వ భూమి కాస్త..ప్రైవేట్ ల్యాండ్‌గా చకచకలా ఫైల్స్ కూడా కదిలాయి.
ఐతే చివరి నిమిషంలో వారి ప్లాన్ బెడిసికొట్టడంతో కబ్జా బండారం బట్టబయలు అయిందట. ఇంతకు సర్కార్ ల్యాండ్‌పై కన్నేసిన ఆ మాజీ మంత్రి ఎవరు..? గతంలోనూ భూమాయపై సిట్‌లో ఆయన పేరుందా..? అదే నేత గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు.. వైజాగ్ భూమూల కబ్జాలపై కలెక్టర్ కి లేఖ రాయడం హాట్ టాపిక్ అవుతుందట. మొత్తానికిఈ భూ బాగోతం ఇప్పుడు సస్పెన్స్ ధ్రిల్లర్స్ ను మించిపోతోంది.




