News Analysis: రైతు భరోసాపై ‘హెచ్ఎంటీవీ’ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధం!
News Analysis: News Analysis: తెలంగాణలో ‘రైతు భరోసా’ నిధుల విడుదల మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ కాక రేగుతోంది.
News Analysis: తెలంగాణలో ‘రైతు భరోసా’ నిధుల విడుదల మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ కాక రేగుతోంది. నిన్న జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి విడత కింద ₹2,400 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేయడం, రాబోయే తొమ్మిది రోజుల్లో మొత్తం ₹9,000 కోట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. హెచ్ఎంటీవీ (hmtv) నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికగా ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి ఎకరాకు ₹15,000 ఇస్తామని 'రైతు డిక్లరేషన్' ప్రకటించి, తీరా ఇప్పుడు కేవలం ₹6,000 మాత్రమే ఇస్తూ రైతులను గోస పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా రైతు భరోసా నిధులు ఇవ్వకుండా దాదాపు ₹29,720 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని ఆరోపించారు.




