Daggubati Purandeswari: ఇసుక మాఫియాను, అవినీతిని బయటపెట్టింది మేమే

Daggubati Purandeswari: గతంలో ఇసుక మాఫియాను, అక్రమాలను రుజువులతో సహా ప్రజల ముందు పెట్టింది బీజేపీనే అని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. hmtv ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు.

Arun Chilukuri
Published on: 28 Sept 2026 1:10 PM IST
Daggubati Purandeswari: ఇసుక మాఫియాను, అవినీతిని బయటపెట్టింది మేమే
X

Daggubati Purandeswari: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మాఫియా మరియు వివిధ అవినీతి అక్రమాలను రుజువులతో సహా ధైర్యంగా బయటపెట్టింది భారతీయ జనతా పార్టీనే అని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. hmtv ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై పలు కీలక విషయాలను పంచుకున్నారు.

గతంలో ఎవరూ భయపడి మాట్లాడటానికి ముందుకు రాని సందర్భంలోనూ తాము అధ్యక్షురాలిగా ఉండి రుజువులతో సహా అక్రమాలను ప్రజల ముందుంచామని పురందేశ్వరి గుర్తుచేశారు. రాంపుల్‌కు వెళ్లి లారీలతో సహా ఇసుక మాఫియా బాగోటాన్ని బయటపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. గ్రామాలకు రావాల్సిన నిధులను డైవర్ట్ చేయడంపై సర్పంచులతో కలిసి సమర్థవంతంగా ఆందోళనలు చేపట్టామని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ బీజేపీ ప్రజల పక్షాన నిలబడే పార్టీగా గుర్తింపు తెచ్చుకుందని ఆమె పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.