BIG Debate: హామీలు ఎక్కడ? 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్షం నిలదీత
BIG Debate: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై హెచ్ఎంటీవీ బిగ్ డిబేట్. బీఆర్ఎస్ నేత శుభప్రద పటేల్ మరియు ఇతర ప్రతినిధుల చర్చ.
BIG Debate: హామీలు ఎక్కడ? 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్షం నిలదీత
BIG Debate: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన తరుణంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇచ్చిన హామీల అమలు తీరు, ప్రభుత్వ పాలన వైఫల్యాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇదే అంశంపై హెచ్ఎంటీవీ (hmtv) నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత శుభప్రద పటేల్ తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని డిబేట్లో ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు, జూరాల ప్రాజెక్ట్ వద్ద రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను ప్రస్తావించారు.




