Off The Record: మీడియా ను పక్కన పెట్టి? సోషల్ మీడియా వెంటపడుతున్న చంద్రబాబు? ఎందుకో తెలుసా?
Off The Record: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో వరుస భేటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు?
Off The Record: మీడియా ను పక్కన పెట్టి? సోషల్ మీడియా వెంటపడుతున్న చంద్రబాబు? ఎందుకో తెలుసా?
Off The Record: కాలం మారుతోంది. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. దీంతో రాజకీయ పార్టీల ఎత్తుగడలు, ప్రచార వ్యూహాలూ మారుతున్నాయి. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియానూ నమ్ముకోవడం ఎక్కువైంది. టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో సోషల్ మీడియానూ మరో వనరుగా భావిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఈ మధ్యన సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ల హడావుడి అతిగా కనబడుతుంది. మొన్న చిత్తూరు సభ కావచ్చు, రెండు రోజుల క్రితం జరిగిన కాకినాడ జిల్లా తునిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు. ఇలా ఎక్కడ పర్యటన జరిగినా అక్కడి స్థానిక సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్లను ఆహ్వానిస్తూ వారితో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం పర్యటన అంటే పార్టీ ముఖ్యనేతలతో సమావేశం, అధికారులతో మీటింగ్‌లు, సమీక్షలు, మీడియాతో చిట్‌చాట్‌లు చూస్తుంటాం. వాటితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు.. సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్లతోనూ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఐతే వారితో భేటీ కావడం పట్ల మీడియా వర్గాల్లో చర్చకి దారితీస్తుంది. విపక్షంలో ఉన్నప్పుడు సొంతంగా సోషల్ మీడియా వార్ రూమ్‌ల ఏర్పాటుతో పాటు.. ప్రధాన మీడియానే ఎక్కువగా నమ్ముకుంది టీడీపీ.
నాయకులు, కార్యకర్తలపై జరిగిన అక్రమ కేసులు, దాడులను తిప్పికొట్టడంలో, నాటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేయడంలో ప్రధాన మీడియా కీలక పాత్ర పోషించాయి. అప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్‌లు అంతగా ఎక్కడా కనబడలేదు. కానీ అధికారం వచ్చాక ఇన్ఫుయెన్సర్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. స్థానికంగా ప్రజాధారణ ఉన్న ఇన్ఫుయెన్సర్ల ద్వారా.. ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది.
ఈ మధ్యకాలంలో ప్రతి రాజకీయ పార్టీకి,, పొలిటికల్ యాక్షన్ కమిటీ లేదా వ్యూహకర్తలు ఉండటం కామన్‌గా మారింది. ఆ వ్యూహకర్తల ఐడియాలజీలో భాగంగానే చంద్రబాబు జిల్లా, నియోజకవర్గాల పర్యటనలో ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఇన్ఫుయెన్సర్లను గుర్తించి వారిని ముఖ్యమంత్రి సభకి ఆహ్వానించి భేటీకి ఏర్పాటు చేయడం జరుగుతుందన్న వాదన వినబడుతుంది. దీనివల్ల ప్రభుత్వం చేసే సంక్షేమ, ఇతర కార్యక్రమాలు సోషల్ మీడియా ఫాలో అయ్యే యువతకు చాలా ఫాస్ట్‌గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని వ్యూహకర్తలు భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో జెన్‌జీల ప్రాధాన్యతా పెరుగుతోంది. పార్టీ వారికి రీచ్ కావాలంటే ఈ సోషల్ మీడియానే ప్రధాన ఆయుధంగా భావిస్తున్నారు. ప్రతి ఇన్ఫుయెన్సర్‌కి స్థానికంగా ఫాలోవర్స్ ఉంటారు. వారితో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయిస్తే.. ఎంతో కొంత మంది ప్రభావితం అవుతారనేది వారి స్ట్రాటజీ కావొచ్చు. ఆ కారణంగానే స్థానిక ఇన్ఫుయెన్సర్లతో సీఎం భేటీ అవుతున్నారని ఇదంతా వ్యూహకర్తల సలహాలో భాగం అయ్యుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మారుతున్న కాలానికి అనుగూణంగా పార్టీలు వారి ప్రచార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇటు పార్టీ, అటు ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారాలకు మెయిన్ మీడియా కన్నా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. నిమిషాల్లోనే ఎక్కువ మందికి సమాచారం రీచ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో వీటిపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారట. సొంతంగా పార్టీ సోషల్ మీడియా ఛానల్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ పేజీల ఏర్పాటుతో పాటు ఇన్ఫుయెన్సర్లను భాగస్వామ్యం చేసుకోవాలని చూస్తున్నారట. వ్యూహకర్తల సూచనలతోనే సీఎం చంద్రబాబు.
ప్రతి పర్యటనలో ఇన్ఫుయెన్సర్లలో భేటీ అవుతూ.. వారిలో ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసేలా జాగ్రత్త పడుతున్నారన్న చర్చ జరుగతోంది. ప్రభుత్వంపై నెగిటివిటీ స్ఫ్రెడ్ కాకుండా ఎక్కడికక్కడ సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ల ద్వారా ప్రచారం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే కొన్ని సందర్భాల్లో.. సోషల్ మీడియా స్పెకులేషన్స్ వివాదాలకు దారీతియ్యేచ్చు. ఐతే గతంలో వైసీపీ ఇదే సోషల్ మీడియాను అతిగా నమ్మి భారీ ఓటమి చెవి చూసారని ఇప్పుడు అదే దిశగా ఈ ప్రభుత్వం కూడా వెళితే తిప్పలు తప్పవంటూ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.




