OFF the record: మంత్రి సురేఖ ఎపిసోడ్‌పై కాంగ్రెస్‌లో టెన్షన్.. క్రమశిక్షణ కమిటీ రిపోర్టులో ఏముంది?
OFF the record: కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ హాట్ టాపిక్. సీఎంపై కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు, క్రమశిక్షణ కమిటీ నివేదిక, బర్తరఫ్ ఊహాగానాలపై చర్చ.
OFF the record: మంత్రి సురేఖ ఎపిసోడ్‌పై కాంగ్రెస్‌లో టెన్షన్.. క్రమశిక్షణ కమిటీ రిపోర్టులో ఏముంది?
OFF the record: మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్‌పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు.. కొండా సురేఖను చిక్కుల్లో పడేశాయి.
ఏకంగా మంత్రివర్గం నుంచి ఆమెను బర్తరఫ్ చేస్తారనే ఊహాగానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూర్చేలా ఉంటున్నాయి. సుస్మిత వ్యాఖ్యలు, ఆ తర్వాత కొండా సురేఖ వివరణను తీవ్రంగా తప్పుబట్టిన క్రమశిక్షణ కమిటీ.. ఇప్పటికే పీసీసీకి, పార్టీ హైకమాండ్‌కు రిపోర్ట్ ఇచ్చింది.
దీంతో ఆ నివేదికలో ఏముంది..? సురేఖాపై సస్పెన్షన్ వేటు తప్పదా..? కేవలం కేబినెట్ నుంచే తొలగించి ఊరుకుంటారా లేక మొత్తం పార్టీ నుంచి తప్పిస్తారా అన్న చర్చ సైతం జరుగుతోంది. మొత్తం వివాదం పరకాల సీటు విషయంలో మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్.. పరకాలలో మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరినే బరిలోకి దించుతానని ప్రకటన చేశారు.
ఇది కొండా వర్గంలో కలవరం రేపింది. ఈ స్థానం నుంచి పోటీకి సిద్ధం అవుతున్న కొండా సుస్మిత.. సీఎం అనౌన్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు పార్టీ లైన్‌ను దాటి రేవంత్‌పై, ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐతే కూతురు వ్యాఖ్యల్ని మంత్రి సురేఖ ఖండించకుండా నాకు సంబంధం లేదని క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు బదులు ఇవ్వడం..పైగా తనపైనే కుట్ర జరుగుతుందని పీసీసీకి లేఖ రాయడం పార్టీని కుదిపేసింది.
సురేఖ తీరు పట్ల వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్‌లు మీడియాకు ఎక్కి ఆమెపై పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం కలవరం సృష్టించాయి. వరుసగా CLPలో మీడియా సమావేశం పెట్టారు. CM కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె పై చర్యలు క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని... సున్నితంగా కొట్టిపడేశారు..
ఇలా పొలిటికల్ దుమారం నడుస్తుంటే.. మంత్రి కొండా సురేఖ మాత్రం ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను బెంగళూరులో కలిసి మొత్తం ఎపిసోడ్ గురించి వివరించినట్టు ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ వచ్చాకే అన్నీ మాట్లాడతానని చెప్పిన సురేఖ..
సడెన్‌గా ఖర్గేను కలిసి వచ్చాక నిన్న, ఇవ్వాళ తన మంత్రిత్వ శాఖపై జూమ్ మీటింగ్‌లో అధికారులతో సమావేశం నిర్వహించడం రాజకీయ చర్చకు కారణం అవుతుంది. ఓవైపు తన నియోజవకర్గంలో పర్యటనలు, జూమ్ మీటింగ్‌లో అధికారులతో సురేఖ సమీక్షలు జరుపుతుండగానే....
మరోవైపు దేవాదాయశాఖలో అధికారుల డిప్యూటేషన్ల బదిలీలను ప్రభుత్వం నిలిపివేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు కొండా సురేఖకు ఎవరు మద్దతు తెలుపలేదు.. దీంతో కొండా సురేఖను భర్తరఫ్ చేస్తారా...
ఒకవేళ చేస్తే పార్టీలో ఆమె రోల్ ఏంటి...పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారా... ఈ సమయంలో భర్తరఫ్ తో పార్టీ నుంచి సస్పెండ్.. పార్టీకి లాభమా నష్టమా...ఇలా అనేక ప్రశ్నలు పార్టీ ముందు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే కొండా మురళి..డిప్యూటీ సీఎం భట్టిని కలవడం కీలక పరిణామంగా మారింది. భట్టితో ఏం చర్చించారు..? వేటు పడకుండా చూడాలని కోరారా లేక ఇంకేమైన చర్చ జరిగిందా.? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే టైంలో రాజగోపాల్‌రెడ్డి ఉండటం.. పరిణామాలను హీటెక్కిస్తున్నాయి.
ఐతే పాలనాపరంగా కొండా సురేఖ ఆక్టివ్ కావడం... దీనికి తోడు ఆమె పదవి పోతుందని ఆక్టివ్ అయ్యారా...లేక ఏం కాదు అన్న ధీమా ఉందా...లేక ... ఏఐసీసీ కీలక నేత KC వేణు గోపాల్ అందుబాటులో లేఖ పోవడం వల్ల చర్యలకు టైం పట్టే అవకాశం ఉందా...ఇలా అనేక కారణాల మధ్య వాట్ నెక్స్ రోల్ కొండా సురేఖ అన్న రాజకీయ చర్చ 4మాత్రం జోరుగా నడుస్తుంది...




