Big Debate: పార్టీ మారితే ఎమ్మెల్యే పదవి పోతుందా? బిగ్ డిబేట్‌లో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ కీలక వ్యాఖ్యలు!

Big Debate: పార్టీ మారితే ఎమ్మెల్యే పదవి పోతుందా అనే అంశంపై hmtv బిగ్ డిబేట్‌లో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ పలు కీలక విషయాలు పంచుకున్నారు.

Arun Chilukuri
Published on: 19 Sept 2026 11:36 AM IST
Big Debate
X

Big Debate: పార్టీ మారితే ఎమ్మెల్యే పదవి పోతుందా? బిగ్ డిబేట్‌లో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ కీలక వ్యాఖ్యలు!

Big Debate: పార్టీ మారితే ఎమ్మెల్యే పదవి పోతుందా అనే అంశంపై hmtv నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ పలు కీలక విషయాలపై మాట్లాడారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఆయనపై అనర్హత వేటు పడడం ముందే ఊహించిందేనని గౌరీ శంకర్ తెలిపారు. పార్టీ మారిన వారు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, కేవలం లాభాల కోసం పార్టీలు మారడం నైతికత కాదని పేర్కొన్నారు.

స్పీకర్‌కు అదనపు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఏమీ ఉండవని, చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ఉద్దేశించిన యాంటీ డిఫెక్షన్ చట్టం కచ్చితంగా అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.