Off The Record: విడదల రజనీ మెడకు బిగిస్తున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?
Off The Record: మాజీ మంత్రి విడదల రజిని చుట్టూ బిగుస్తున్న చట్టపరమైన ఉచ్చు.
Off The Record: విడదల రజనీ మెడకు బిగిస్తున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?
Off The Record: వ్యాపారం.. రాజకీయం కలగలిపితే ఆ మహిళా నేత. ఆవిడే మాజీ మంత్రి విడదల రజనీ. ఎవరి వద్ద ఐతే రాజకీయ అక్షరాలు దిద్దారో చివరికి ఆయనపైనే పోటీకి సై అన్నారు. సైకిల్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రజనీ...2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరారు. ఫ్యాన్ పార్టీ అధినేతకు దగ్గరయ్యారు. ఆయన కోటరీలో చక్రం తిప్పారు. ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు విడదల రజినీ. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అంతే అక్కడ నుంచి రజనీ కొత్త అవతారం ఎత్తారు. ఎక్కడా నో కాంప్రమైజ్. డబ్బు కొట్టు.. పని పట్టు అన్నట్లుగా రజనీ క్యాంపు చెలరేగిపోయింది.
మంత్రి అయ్యాక.. రజనీ తన విశ్వరూపం చూపించారు. పవర్‌ను అడ్డుపెట్టుకుని మంత్రి అనుచర ఘనం చెలరేగిపోయింది. రజనీతో పాటు ఆమె మద్దతు దారులు.. అనుచరులు.. పీఏలుగా పని చేసిన వారు, కుటుంబ సభ్యులు అందరూ ఒకే లక్ష్యంతో పని చేసారు. పదవిలో ఉన్నంత కాలం ప్రతీ అంశాన్ని సొమ్ము చేసుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే నియోజకవర్గంలోని క్రషర్ యజమానులను బెదిరించారు. మంత్రి కావటంతో ఆ వ్యవహారం బయటకు రాలేదు. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని, మమ్మల్ని అడిగేవారే ఉండరన్న ధీమాతో గుప్పిట్లో పెట్టుకున్నారు. నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి.
ఐతే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పుతో కొత్త ప్రయోగం చేశారు జగన్. అందులో భాగంగా రజనీని సిట్టింగ్ స్తానమైన చిలకలూరిపేట నుంచి.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న సొంత నియోజకవర్గంలోనే బొలెడంత వ్యతిరేకతను మూటగట్టుకున్న రజినీని.. నియోజకవర్గ మార్పు కూడా గట్టెక్కించలేకపోయింది. ఆ ఎన్నికల్లో వైసీపీ పవర్‌కు దూరం కావడంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా రజనీ కూడా ఓడిపోయారు. అధికారం పోయిన వెంటనే రజనీ అవినీతి చిట్టా బయటకు వచ్చింది. మైనింగ్ వ్యాపారులను బెదిరించి కోట్లు వసూలు చేసినట్లు ఆమె ఆరోపణలు వెల్లువెత్తాయి. రజనీ వద్ద పని చేసిన సిబ్బందితో పాటుగా కుటుంబ సభ్యుల వసూళ్లు బయటపడ్డాయి. అక్రమ వసూల్లు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.
మైనింగ్ వ్యాపారులును బెదిరించి కోట్లు వసూలు చేసినట్లు విడదల రజనీపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు రజనీ మరిది గోపినాధ్ ఏసిబి అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. యడ్లపాడు మండలం కండ్రిగ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాని నల్లపనేని చలపతిరావును డబ్బు కోసం బెదిరించారనే ఆరోపణలతో ఈ కేసు రిజిస్టర్ అయింది. రజనీ పీఏ రామకృష్ణ ఐదు కోట్లు డిమాండ్ చేశారనేది మరో ఫిర్యాదు. రూ 5 కోట్లు డిమాండ్ చేస్తే బేరసారాలు చేసి 2కోట్లు ఇచ్చినట్లు ఫిర్యాదు దారులు పోలీసులకు వివరించారు. విడదల రజనీ ఒత్తిడితో మైనింగ్ వ్యాపారులను తనిఖీల పేరుతో ఇబ్బందులు పెట్టినట్లు లికిత పూర్వకంగా ఐపిఎస్ అధికారి వాంగ్మూలం ఇచ్చారు. దీంతో సెంట్రల్ ఇన్వెస్టగేటివ్ యూనిట్ కేసు నమోదు చేశారు.
ఒక దశలో రజనీ అరెస్ట్ ఖాయమని ప్రచారం సాగింది. ఇక రజనీ తిరిగి తన సొంత నియోజకవర్గం చిలకలూరి పేటకు వచ్చేసారు. ఇప్పుడు ఈ వ్యవహారాలు రజనీ అండ్ టీం మెడకు చుట్టుకుంటోంది..
కాగా..వైసీపీలో ముఖ్యనేతగా చక్రం తిప్పాలన్న రజనీ వ్యూహాలు బెడిసికొట్టాయి. సొంత నియోజకవర్గంలోనే పరిస్థితులు భిన్నంగా మారాయి. ఇప్పుడు రజనీ మాట చెల్లుబాటు కావటం లేదు. అధికారంలో ఉన్న సమయంలో పట్టించుకోకపోవటం.. వివాదాల కారణంగా మద్దతు దారులు దూరమయ్యారు. పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలను కాదని... తనకు నచ్చిన వారిని రజనీ ప్రోత్సహించారట. ఫలితంగా పార్టీ శ్రేణులు నిరాదరణకు గురైవడంతో.. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో వైసీపీ కేడర్ నుంచే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఎక్కువ సమయం హైదరాబాద్‌లో ఉంటున్నారట. ప్రధాన నేతలు ఫోన్ చేసినా అందుబాటులోకి రావడం లేదట. పీఏల నుంచీ స్పందన ఉండడం లేదట. సొంత పార్టీ శ్రేణులకు అవసరం అయిన సమయంలో అండగా నిలవలేని నేత ఉన్నా.. లేకున్నా ఒకటే అనే అభిప్రాయం వైసీపీ కేడర్ లో బలంగా వినిపిస్తోంది.
దీంతో.. చిలకలూరిపేటలో పార్టీ గురించి పట్టించుకోకుండా.. తన ఎదుగుదల కోసమే ఆలోచన చేసే రజనీ స్థానంలో మరొకరికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని కేడర్ కోరుతున్నారు. కానీ రజినీ మాత్రం కేవలం అధినేత కోటరీనే నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. ఇలా నిత్యం వివాదాలు.. సమస్యలతో పార్టీకి నష్టం చేస్తున్న రజనీ విషయంలో ఇప్పటికైనా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది రానున్న రోజుల్లో స్పష్టత రావాల్సి ఉందతి. ఈ క్రమంలో అటు కేసులు.. ఇటు రాజకీయ భవిష్యత్ అర్దం కాక.. రజనీ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. దీంతో.. రజనీ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి..ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.




