Burning Topic: ప్రపంచంపై ఎల్ నినో కరాళ నృత్యం!
Burning Topic: ప్రపంచాన్ని వణికిస్తున్న 'సూపర్ ఎల్ నినో'. 2027 వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని WMO హెచ్చరిక. భారత్‌లో కరువు, ఆహార సంక్షోభం వచ్చే ముప్పు.
Burning Topic: ప్రపంచంపై ఎల్ నినో కరాళ నృత్యం!
Burning Topic: సూపర్ ఎల్ నినో ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖకు సమీపంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం వేగంగా బలపడుతున్న ఎల్‌నినో ఈ ఏడాది డిసెంబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని ప్రకటించింది. దీని ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతోంది. అక్టోబర్- నవంబర్- డిసెంబరులో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగొచ్చని చెప్పిన సౌలో- సముద్ర మట్టం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3.7 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగి సరికొత్త రికార్డుల్ని సృష్టించవచ్చని అంచనా వేశారు. సాధారణంగా జూన్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.6 డిగ్రీ సెల్సియస్ మేర ఎక్కువగా ఉండగా, ఆగస్ట్ నాటికి అది 2.5 డిగ్రీ సెల్సియస్‌కు పెరిగిందని చెప్పారు. ఇప్పుడు రానున్న నెలల్లో మరింత పెరుగుతుందని అన్నారు.
వాతావరణ శాఖ నిపుణులు ప్రపంచ దేశాలకు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. 1950 సంవత్సరం తర్వాత ఎన్నడూ లేనివిధంగా వాతావరణంలో అత్యంత ప్రమాదకరమైన, ఊహించని పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితులు ఇప్పటికే పూర్తిగా స్థిరపడి, అత్యంత వేగంగా బలపడుతున్నాయని ప్రపంచ వాతారణ సంస్థ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో తెలిపారు ఎల్‌నినో పరిస్థితులు ఇప్పటికే పూర్తిగా స్థిరపడి, అత్యంత వేగంగా బలపడుతున్నాయని ఆమె వెల్లడించారు. ఇంకా ఈ బలమైన ఎల్‌నినో పరిస్థితులు 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అంచనాలు ఉన్నాయని, 100 % ఇది జరగొచ్చని తెలిపారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వేడి, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, మరికొన్ని చోట్ల భారీ వరదలు సంభవించే ముప్పు ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సూపర్ ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేనంతటి ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి
పసిఫిక్ మహాసముద్రం గత కొన్ని సంవత్సరాలుగా తనలో నిల్వ చేసుకున్న భారీ మొత్తంలోని వేడిని ఒక్కసారిగా వాతావరణంలోకి విడుదల చేస్తోంది. దీనివల్ల ప్రపంచంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం కంటే అసాధారణ రీతిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు హిందూ మహాసముద్రంలో పరిస్థితులు కూడా అక్టోబరులో గరిష్ఠ స్థాయికి చేరుకొని, ఆ తర్వాత బలహీనపడతాయని డబ్ల్యూఎంఓ వెల్లడించింది. అట్లాంటిక్ మహా సముద్రంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా కొనసాగుతుండటంతో రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు అస్తవ్యస్తంగా మారనున్నాయని తెలిపింది.కొన్ని చోట్ల ఊహించని వాతావరణ పరిస్థితులు, సంభవిస్తాయి. ఇంకా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిన ఉంటుంది. కురవాల్సిన సమయంలో వర్షాలు కురవక, అకాలంలో బీభత్సం సృష్టించే ప్రమాదం కూడా ఉంటుంది.
మరోవైపు సూపర్ ఎల్ నినో ప్రభావం భారత్‌లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలోని ప్రజలు, పర్యావరణంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపే అవకాశం కూడా ఉందని WMO హెచ్చరించింది. తీవ్రమైన కరువు, తట్టుకోలేని ఎండలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లోని రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరుల జీవితాల్ని మరింత దుర్భరంగా మార్చే ప్రమాదం ఉందని అంచనా. ఇప్పటికే దేశంలో నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైన పరిస్థితుల్లో.. రాబోయే నెలల్లో వర్షాలు, ఉష్ణోగ్రతలు, నీటి లభ్యత, వ్యవసాయంపై దీని ప్రభావం పడుతోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 13% తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. జూన్- సెప్టెంబర్ మధ్య కాలంలో సగటు వర్షపాతం కేవలం 87.4 శాతమే నమోదైంది. ఇది 2001 తర్వాత దేశంలో 4వ అత్యంత పొడి రుతుపవన కాలంగా నిలిచింది.
సాధారణంగా ఈ రుతుపవనాల సీజన్‌లో దేశవ్యాప్తంగా 868.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఎల్‌నినో ప్రభావంతో అది ఈ ఏడాది కేవలం 759.4 మిల్లీమీటర్లకే పరిమితమైంది. ఎల్ నినో ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, వచ్చే ఏడాది మార్చి వరకు కరువు పొడిగించబడే ప్రమాదం ఉంది. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో ఉండే చలి తీవ్రత ఈసారి చాలా తక్కువగా ఉండనుంది. దేశంలో శీతాకాలపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతాయని, చలికాలంలోనూ ఉక్కపోత తప్పదని వాతావరణ శాఖ తెలిపిందివర్షాలు లేక వ్యవసాయోత్పత్తి తగ్గడం, అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాల వల్ల ఎరువుల కొరత ఏర్పడటంతో రానున్న నెలల్లో భారత్‌లో పెద్ద ఎత్తున ఆహార సంక్షోభంరావచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.




