Jordar News: మందుబాబులకు బిగ్ షాక్.. ఎక్కడో తెలుసా?
Jordar News: కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుల రచ్చ. మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన మహిళలు.
Jordar News: మందుబాబులకు బిగ్ షాక్.. ఎక్కడో తెలుసా?
Jordar News: వామ్మో.. మహిళా లోకమంత మందు మీద యుద్దం ప్రకటించినట్టే ఉన్నది గదా. సర్కార్ ఆమ్దానీని ఎట్ల జేశి తక్వ జెయ్యాల్నని శిగమెత్తినట్టే బైలెల్లిర్రు మైళక్కలంత. ఈ తాగువోతుల సమస్యంటె.. ఏ ఇద్దరో ముగ్గురో.. వాడకట్టోల్లో కదిలిర్రనుకున్నం. కనీ., ఊరు ఊరంత దండయాత్రకు బైలెల్లిర్రు గదా. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వేంపల్లి కాడున్న బెల్టుషాపులన్నిటినీ ఎంబటే బందు వెట్టాల్నని శిన్నాపెద్దా.. ముసలి ముత్కా.. అమ్మలక్కలంత కదిలిర్రు.
కాగజ్ నగర్ పెద్ద తొవ్వకు అడ్డం కూసున్నరు. మా తిప్పలు తీర్శే దాంక ఒక్కటంటె ఒక్క బండి గూడ ఈన్నుంచి పొయ్యేది లేదని మందు మీద మంగమ్మ శపథం జేశిర్రు. ఏడనైనా మందు బందని తీర్మానాలు జేస్తున్నరు. కట్టుబాటు మీద కట్టడిగుంటున్నరు. మరి గా ఉపాయం జేస్తె మంచిగుండంటె.. అది గూడ జేశిర్రట. కనీ., ఈ ఊర్ల ఒక్కటి గాదు రెండు గాదు.. 15కు మీదనే ఉన్నయట బెల్టు దుక్నాలు. కట్టడిని లెక్క జేస్తలేరట. అడ్డగోలుగ సంపాయించిన పానాలు, ఏడ ఇంటరు చెప్పుర్రి. ఒగలు కాకపోతే ఒగలు తెర్శి రికాం లేకుంట మందన్నల కుత్కె తడ్పుతున్నరట. ఇగ శెప్పి శెప్పి యాశ్టకచ్చి మహిలక్కలంత హైవేకు అడ్డం తిర్గిర్రు.
ఊర్ల ఆడోల్లంత ఒక్కటే మాటన్నట్టు కట్టు మీదుంటె.. కొందరు మొగోల్లు, బెల్టులు బంజేసుడు ఇష్టం లేకున్నా దీక్షకు కూసున్నరు. అచ్చి అక్కల ఎన్కపొంటి నిల్సొని ఫోటువలు వీడియోలు తీసుకున్నరు. పోలీసోల్లు లెమ్మన్నా లేవలేదు. కనీ., ఆబ్కారోల్లచ్చి తీశేత్తమని హామీ ఇయ్యంగనే కట్లు తెంపుకొని ఇంటికి పోయిర్రు. మరి ఇచ్చిన మాట ప్రకారం అబ్కారోల్లు బెల్టు షాపుల మీద నిషేదం పెడ్తరో.. లేకుంటే.. తెల్శిన పద్దతిలనే, పేను వారనట్టు ఊకుంటరో రేపు రేపు సూడాలె. ఏమాటకామాటనే కనీ.. బెల్టులు బంజేసుడు జర్రంత కష్టమే మన సర్కార్లకు. దినాం రికాంలేకుంటచ్చే ఆమ్దానీని ఇడ్శిపెట్టుడంటె శానా కష్టమే గద మరి.




