BIG Debate: కేంద్రానివి ఓటు బ్యాంక్ రాజకీయాలు: మాజీ మంత్రి సత్యవతి!

BIG Debate: మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం కాకుండా, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 18 July 2026 11:21 AM IST
BIG Debate
X

BIG Debate: కేంద్రానివి ఓటు బ్యాంక్ రాజకీయాలు: మాజీ మంత్రి సత్యవతి!

BIG Debate: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో hmtv బిగ్ డిబేట్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా బిల్లు విషయంలో కేంద్రం క్రెడిట్ పాలిటిక్స్ పక్కనపెట్టి, అన్ని పార్టీలను కలుపుకొని పోవాలని డిమాండ్ చేశారు.

దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించకపోవడం అత్యంత బాధాకరమని సత్యవతి రాథోడ్ అన్నారు. దేశంలో ఇప్పటివరకు 130 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయని, కానీ మహిళా బిల్లుకు మాత్రం మోక్షం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్‌లో సోనియా గాంధీ, ప్రతిభా పాటిల్, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ వంటి అగ్రనేతలు ఉన్నప్పుడే బిల్లు పాస్ అవుతుందని భావించామని, కానీ ఇప్పటికీ పురుషాధిక్యత మనస్తత్వాల వల్లే బిల్లు ఆగిపోతోందని విమర్శించారు. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో లబ్ధి పొందడానికే కేంద్రం ఈ బిల్లును ఒక అస్త్రంగా వాడుకుంటోందని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story