Big Debate: డీఎస్సీకి ఒక న్యాయం.. నీట్ పేపర్ లీక్‌కు మరో న్యాయమా?: ఉమావల్లి యాదవ్ తీవ్ర ఆగ్రహం!

Big Debate: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ వైఖరిని స్పష్టం చేసిన నాయకురాలు కాకు ఉమావల్లి యాదవ్.

Arun Chilukuri
Published on: 29 July 2026 11:20 AM IST
Big Debate
X

Big Debate: డీఎస్సీకి ఒక న్యాయం.. నీట్ పేపర్ లీక్‌కు మరో న్యాయమా?: ఉమావల్లి యాదవ్ తీవ్ర ఆగ్రహం!

Big Debate: దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకు ఉమావల్లి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, విద్యార్థుల ఆవేదనపై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఉమావల్లి యాదవ్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి కష్టపడి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల జీవితాలతో పేపర్ లీకేజీల వల్ల చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా, స్వచ్ఛందంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి చేస్తున్న పోరాటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story