Off The Record: అదే జరిగితే... మళ్లీ అధికారంలోకి వైఎస్ జగన్

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మళ్లీ పీకే (Prashant Kishor) టీంను రంగంలోకి దించుతున్నారా?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 May 2026 6:38 AM IST
Off The Record
X

Off The Record: అదే జరిగితే... మళ్లీ అధికారంలోకి వైఎస్ జగన్

Off The Record: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యంగా ఒక పెద్ద సెన్సేషన్ చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అఖండ విజయాన్ని సాధించడం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విజయాన్ని సాధారణ రాజకీయ పరిణామంగా చూడడం కంటే, ఒక వ్యూహాత్మక మాస్టర్‌ప్లాన్‌గా విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ముందు పెద్దగా కనిపించని ఓటు బ్యాంకు, చివరి దశలో ఒక్కసారిగా కన్సాలిడేట్ అవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రౌండ్ లెవెల్లో ఓటర్ల మూడ్‌ను అంచనా వేసి, దానికి అనుగుణంగా ప్రచారం మార్చడం స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

యువతను ఆకట్టుకునేలా రూపొందించిన క్యాంపెయిన్ల ప్రభావం చూపించాయని అంటున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం ఈసారి విపరీతంగా పెరిగింది. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక వ్యూహం అమలు చేసినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ మొత్తం ప్లాన్ వెనుక ఎవరు ఉన్నారన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా.. ఒకే పేరు ఎక్కువగా రీసౌండ్ చేస్తోంది. అదే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. పీకే టీం స్టైల్‌ను పోలిన ఎన్నో అంశాలు ఈ ఎన్నికల్లో కనిపించాయని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీవీకే విజయ్ వెనుక పీకే పాత్ర లేకపోలేదన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీకే ఒకే.. కానీ ఈ మొత్తం వ్యవస్థను సమన్వయం చేసిన మరొక వ్యక్తి పేరు వెలుగులోకి వస్తోంది. పీకే టీం నుంచి విడిపోయిన కీలక వ్యూహకర్త రిత్విక్ చక్రవర్తి. ఆయనే ఈ ప్రాజెక్ట్‌కు కీలకంగా పనిచేశారన్న ప్రచారం ఉంది. రిత్విక్‌తోపాటు పీకే టీంలోని 10, 12 మంది కోర్ మెంబర్స్ కూడా బయటకు వచ్చి పనిచేసినట్టు చెబుతున్నారు. వీరు పీకే దగ్గర ట్రైనింగ్ తీసుకున్నవారే కావడం విశేషం. అందుకే ఈ క్యాంపెయిన్‌లో పీకే స్టైల్ స్పష్టంగా కనిపించిందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇది ఒకరకంగా పీకే మోడల్ విస్తరణగా కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఈ విజయం వెనుక టీం వర్క్ ఎంత కీలకమో మరోసారి రుజువైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమిళనాడు ఫలితాల ప్రతిధ్వని వినిపించడం ఆసక్తికరంగా చెబుతున్నారు.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పీకే పేరు వినిపించడం యాదృచ్ఛికం కాదు. ఏపీ మాజీ సీఎం జగన్ మళ్లీ పీకే టీం వైపు చూస్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో పీకే టీం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమలు చేసిన వ్యూహాలు ఇప్పటికీ పార్టీకి ఒక మోడల్‌గా ఉన్నాయి. గ్రౌండ్ సర్వేలు, డేటా ఆధారిత నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రత్యేకంగా బూత్ లెవెల్ మేనేజ్‌మెంట్‌లో పీకే టీం ప్రభావం కనిపించింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ అదే టీంను రంగంలోకి దించాలన్న ఆలోచన జరుగుతోందన్న ప్రచారం ఉంది. వైసీపీలో అంతర్గతంగా కూడా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయట. అయితే కొందరు పీకేకు అనుకూలంగా ఉండగా.. మరికొందరు మరో కొత్త టీమ్‌ను రంగంలోకి దించాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

వార్తలొస్తున్నట్టు జగన్‌తో పీకే జత కడితే.. హైదరాబాద్ లోటస్ పాండ్ పరిసరాలు మళ్లీ రాజకీయంగా హాట్‌స్పాట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ భవనం నుంచే ఎన్నికల వ్యూహాలు అమలు అయ్యాయి. అక్కడే తాజాగా ఒక పూర్తిస్థాయి వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. డేటా అనలిటిక్స్ నుంచి సోషల్ మీడియా వరకు అన్నీ అక్కడి నుంచే నిర్వహించారు. ఇప్పుడు అదే మోడల్ మళ్లీ రిపీట్ అవుతుందన్న ప్రచారం ఉంది. సెప్టెంబర్ నుంచి అక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయట. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమేనా..? నిజమా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

కానీ లోలోపల జరిగే కదలికలు మాత్రం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొంతమంది కీలక వ్యక్తులు ఇప్పటికే హైదరాబాద్‌లో యాక్టివ్ అయ్యారని టాక్. సోషల్ మీడియా టీంలు కూడా రీ ఆర్గనైజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక పెద్ద క్యాంపెయిన్‌కు ప్రిపరేషన్‌గా భావిస్తున్నారు. ప్రత్యేకంగా 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.

ఈసారి మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉపయోగించనున్నారని సమాచారం. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వ్యూహాలు రూపొందిస్తారట. ఓటర్ల ప్రవర్తనను ముందుగానే అంచనా వేసే ప్రయత్నం చేస్తారట. సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను మరింత దూకుడుగా తీసుకువెళ్లనున్నారట. ప్రత్యేకంగా యువతపై ఫోకస్ పెంచుతారు. గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తారు. ఇది ఒక పూర్తి స్థాయి ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది వైసీపీ నేతలు ఇప్పటికే ఈ ప్రాసెస్‌లో భాగమయ్యారట. ఇది నిజమైతే, వైసీపీ రాజకీయ వ్యూహంలో పెద్ద మార్పు ఖాయంగా చెబుతున్నారు.

జగన్.. తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో చేసిన పాదయాత్ర పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతారట. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెంచుతారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేయాలంటే ప్రొఫెషనల్ టీం సలహాలు, సూచనలు, సాంకేతిక మెలకువలు ఎంతగానో అవసరం. ఇక్కడే పీకే టీం ప్రాముఖ్యత పెరుగుతోంది. పీకే టీమ్ అనుభవం ఈ క్యాంపెయిన్‌కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో పీకే టీమ్‌ది అందె వేసిన చెయ్యి అని చెప్పకతప్పదు. సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌లో కూడా వారికి మంచి అనుభవం ఉంది.

పీకే టీం ప్రస్తుత పరిస్థితిపైనా రకరకాల వాదనలు లేకపోలేదు. బీహార్‌లో కొత్త పార్టీ ఏర్పాటు చేసి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. కానీ స్ట్రాటజీ స్కిల్స్‌పై ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ పండితులు. గతంలో అనేక రాష్ట్రాల్లో విజయవంతమైన క్యాంపెయిన్లు నిర్వహించారు. డేటా ఆధారిత రాజకీయాల్లో పీకే టీమ్ ఒక బ్రాండ్‌గా నిలిచింది. ఇప్పుడు వారి టీం నుంచి కొంతమంది బయటకు రావడం కూడా ఒక కొత్త ట్రెండ్‌గా చెబుతున్నారు. తమిళనాడులో టీవీకే విజయం దీనికి తాజా ఉదాహరణగా మారింది. ఇది పీకే టీం ప్రభావాన్ని మరింతగా పెంచింది. ఇప్పుడు మళ్లీ పెద్ద పార్టీల దృష్టి వారి మీద పడుతోంది. ఇందులో భాగంగానే వైసీపీ కూడా ఈ జాబితాలో చేరిందంటున్నారు.

ఇప్పటికే దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ఎంత కీలకమో అన్ని పార్టీలకు బోధపడింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా తన డిజిటల్ స్ట్రాటజీని పూర్తిగా మార్చే దిశగా ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు. గతంతో పోలిస్తే, ఈసారి మరింత అగ్రెసివ్ క్యాంపెయిన్‌కు సిద్ధమవుతున్నారట. ప్రతి అంశాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట. ప్రత్యేకంగా ప్రతిపక్షాలపై కౌంటర్ నారేటివ్ బిల్డ్ చేయడంపై దృష్టి పెట్టారట. ఇక్కడే పీకే టీం అనుభవం కీలకంగా మారుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డేటా ఆధారంగా సోషల్ మీడియా ట్రెండ్స్‌ను కంట్రోల్ చేయడం వారి ప్రత్యేకతగా భావిస్తున్నారు. అదే మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయనున్నారట. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక డిజిటల్ టీంలు ఏర్పాటు చేసే ప్లాన్ ఉందట. గ్రౌండ్ లెవెల్ ఫీడ్‌బ్యాక్‌ను రియల్ టైమ్‌లో సేకరించే సిస్టమ్‌ను అమలు చేస్తారట. ఇది ఎన్నికల సమయానికి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

గ్రౌండ్ లెవెల్లో కూడా పెను మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాలంటీర్ నెట్‌వర్క్‌ను వైసీపీ మరింత బలోపేతం చేయనుందట. ప్రతి గ్రామంలో పార్టీకి ఒక యాక్టివ్ టీంను ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. ఈ టీంల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే విధానం అమలు చేస్తారు. ఇది ఒక రకంగా పాత పద్ధతికి కొత్త టెక్నాలజీని జోడించినట్టుగా ఉంటుంది. పీకే టీం గతంలో ఇదే మోడల్‌ను విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు అదే పద్ధతిని మరింత విస్తృతంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా యువతను ఈ ప్రాసెస్‌లో భాగం చేయాలని చూస్తున్నారట. ఇది పార్టీకి కొత్త ఎనర్జీని తీసుకురాగలదని నాయకులు భావిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో బలమైన నెట్‌వర్క్ ఉంటేనే ఎన్నికల్లో విజయావకాశాలు పెరుగుతాయని విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే ఈ మార్పులు తీసుకువస్తున్నారు. ఇంతకీ.. 2029 ఎన్నికల నాటికి వైసీపీ వ్యూహరచన ఏ మేరకు ఫలితాలనిస్తుందో చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story