Big Debate: బిల్లు కాదు ముఖ్యం.. బాధిత విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలి: పుణ్యశీల

Big Debate: బిల్లుల ఆమోదం కంటే బాధితులకు న్యాయం చేయడమే ముఖ్యమని వైఎస్సార్‌సీపీ నేత పుణ్యశీల అన్నారు.

Arun Chilukuri
Published on: 30 July 2026 11:07 AM IST
Big Debate
X

Big Debate: బిల్లు కాదు ముఖ్యం.. బాధిత విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలి: పుణ్యశీల

Big Debate: పార్లమెంట్‌లో పేపర్ లీకేజీల నిరోధక బిల్లు ఆమోదం పొందడం మంచి పరిణామమే అయినప్పటికీ, అంతకంటే ముఖ్యం లీకేజీల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం అందించి న్యాయం చేయడమేనని వైసీపీ నేత పుణ్యశీల వ్యాఖ్యానించారు. హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన "బిగ్ డిబేట్" కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, విద్యార్థుల సమస్యలు, జాతీయ స్థాయి పరిణామాలు మరియు ఏపీలోని డీఎస్సీ వివాదాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పుణ్యశీల మాట్లాడుతూ.. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేసినప్పటికీ, లీకేజీల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. విద్యార్థుల నిరసనలకు, పోరాటాలకు మత రంగు పులమడం ఎంతమాత్రం సరికాదని, ఇది భిన్నత్వంలో ఏకత్వం చాటే భారతదేశ సమైక్యతకే విరుద్ధమని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story