News Analysis: అధికార దుర్వినియోగం లేకపోతే కూటమి గెలవలేదు.. స్థానిక పోరుపై వైఎస్సార్‌సీపీ నేత రామారావు సంచలన వ్యాఖ్యలు!
News Analysis: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అక్రమాలు చేయకపోతే గెలిచే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రామారావు తీవ్ర విమర్శలు చేశారు.
News Analysis: అధికార దుర్వినియోగం లేకపోతే కూటమి గెలవలేదు.. స్థానిక పోరుపై వైఎస్సార్‌సీపీ నేత రామారావు సంచలన వ్యాఖ్యలు!
News Analysis: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ-జనసేన కూటమిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. hmtv న్యూస్ ఎనాలసిస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడకుండా ఎన్నికల్లో గెలవలేదని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎదుర్కొంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వీరోచితంగా పోరాడుతుందని రామారావు స్పష్టం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే శ్రేణులను, కేడర్‌ను సమాయత్తం చేశారని తెలిపారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీకి ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్ ఉందన్నారు.




