AP: సాంస్కృతిక రంగానికి నిర్దిష్ట విధానం ప్రకటించాలి: కళాకారుల డిమాండ్

AP: సాంస్కృతిక రంగానికి నిర్దిష్ట విధానం ప్రకటించాలి అఖిలపక్ష కళాకారుల రౌండ్ టేబుల్ భేటీ డిమాండ్. రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి సీపీఐ ఈశ్వరయ్య, కళాకారుల పిలుపు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 22 Sept 2026 11:55 PM IST
AP
X

AP: సాంస్కృతిక రంగానికి నిర్దిష్ట విధానం ప్రకటించాలి: కళాకారుల డిమాండ్

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే నిర్దిష్టమైన సాంస్కృతిక విధానం ప్రకటించి అనేక కళలను జీవం పోయాలని అఖిలపక్ష కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. అంతరించిపోతున్న అనేక జానపద పౌరాణిక గ్రామీణ కళల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించాలని సమావేశం అభిప్రాయపడింది. వివిధ జిల్లాల నుంచి విభిన్న కళా రంగాలలో ఉన్న కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సినీ నటులు నాటక కళాకారులు నాయుడు గోపి రంగస్థలం నటులు బొబ్బిల్లపాటి సాయి తదితర అనేకమంది కళాకారులు పాల్గొన్నారు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ సాంస్కృతిక రంగాన్ని సరియైన ఆలోచన విధానంతో ప్రభుత్వం అనుసరించకపోవడం వలన ఆంధ్ర రాష్ట్రంలో అనేక జానపద పౌరాణిక గ్రామీణ కళలు అంతరించిపోతున్నాయని వాటిని కాపాడుకోవడానికి ప్రభుత్వం తక్షణమే 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

సమాజానికి కళాకారులు చాలా అవసరం అన్నారు. నాయుడు గోపి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే కచ్చితంగా పోరాటం చేయాలన్నారు.బొబ్బిళ్ల పాటి సాయి మాట్లాడుతూ పాలకులు కళారంగాన్ని చాలా చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రద్దు చేయబడిన కళాకారుల పెన్షన్ను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు.అవసరమైతే తాను దీక్షకు పూనుకుంటానన్నారు.

ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి చంద్ర నాయక్ చిన్నం పెంచలయ్యలు మాట్లాడుతూ క్రీడాకారులకు ఇస్తున్న రిజర్వేషన్స్ సౌకర్యాన్ని కళాకారులకు కూడా విద్యా ఉద్యోగాలలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో కళాకారుల సంక్షేమానికి సాంస్కృతిక విధానం కోసం కళాకారులందరిని కలుపుకొని పోరాటానికి కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజానాట్యమండలి అనేక దఫాలుగా కళాకారుల పక్షాన పోరాటాలు నిర్వహించిందన్నారు.

నంది నాటకోత్సవాలలో జానపద గ్రామీణ గేయ కళాకారులకు కూడా నంది పోటీలు నిర్వహించాలన్నారు.కార్యక్రమంలో ప్రజానాట్యమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ప్రజానాట్యమండలి జాతీయ నాయకులు ఘని గుంటూరు కళాపరిషత్ కార్యదర్శి బి పూర్ణ జానపద కళాకారుల సంఘం నాయకులు కృష్ణ బాబు గణపతి హృదయ రాజు ఎల్ ఆర్ కృష్ణ డప్పు కళాకారుల సంఘం నాయకులు మారెళ్ళ శ్రీనివాస్ క్రాంతి అరుణోదయ శ్రీనివాస్ ప్రజానాట్యమండలి నాయకులు ఆర్ రామకృష్ణ ఆర్ పిచ్చయ్య మహంతి లక్ష్మణరావు ఎస్ కే నజీర్ బైరా పట్నం రామకృష్ణ వి నాగరాజు శివయ్య ఆరేటి రామారావు అప్పన్న సీతారాం ప్రసాద్ శ్యామల్ దోనేపూడి సూరిబాబు దామోదర గణపతి.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.