Indrakeeladri: భవానీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ ఆలయం!

Indrakeeladri: ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భవానీ నామస్మరణతో మార్మోగుతోంది. భవానీ భక్తుల దర్శనాల కోసం ఆలయ ఈవో, పోలీసులు రాత్రంతా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించారు.

Satyanarayana, Vijayawada
Published on: 22 Oct 2026 8:48 AM IST
Indrakeeladri
X

Indrakeeladri: భవానీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ ఆలయం!

Indrakeeladri: బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు రాత్రి అంత ఆలయ ఈవో శీనా నాయక్, పోలీస్ అధికారులు ఆలయానికి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు తరలి రావడంతో ప్రతి సెకండ్ పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎక్కడ ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేశారు.

గురువారం ఉదయం 5.10 గంటలకు 25,722 మంది భక్తులు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము 2 గంటలలోపే శ్రీ అమ్మవారి దర్శనం ప్రారంభం. భవాని భక్తులసేవలో అహిర్నశలు శ్రమిస్తున్న దేవాలయ సిబ్బంది, అర్చకులు, పోలీస్ సిబ్బంది.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada