Vijayawada: విజయవాడ పశ్చిమంలో గణపతి పూజల్లో పాల్గొన్న బుద్ధా వెంకన్న!

Vijayawada: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గణపతి మహోత్సవాల్లో పాల్గొన్న బుద్ధా వెంకన్న. పలు ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 14 Sept 2026 3:35 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడ పశ్చిమంలో గణపతి పూజల్లో పాల్గొన్న బుద్ధా వెంకన్న!

Vijayawada: వినాయక చవితి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన గణపతి మహోత్సవ కార్యక్రమాల్లో పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భవానిపురం లారీ స్టాండ్, కెసి పబ్లిక్ స్కూల్ రోడ్డు, భవానిపురం రైతు బజార్, హౌసింగ్ బోర్డు కాలనీ, ఊర్మిళా నగర్ రామాలయం, ఊర్మిళా నగర్ ఆటో స్టాండ్, లంబోదర సేవా సమితి వారి జోజి నగర్, మిధుల నగర్ రాజుగారి ప్లాట్లు, నాలుగు స్తంభాల సెంటర్, మల్లికార్జునపేట అర్జున్ వీధి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ వినాయక చవితి పండుగ ప్రజలందరికీ ఆనందం, శాంతి, సౌభాగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

గణపతి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులు, యువత, భక్తులు మరియు స్థానిక ప్రజలను ఆయన అభినందించారు. పండుగను అందరూ ఐకమత్యంతో, భక్తి భావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.