Vijayawada: పోలీస్ కమిషనరేట్‌లో 'హరితాంధ్రప్రదేశ్' మొక్కలు నాటిన రాజశేఖర బాబు

Vijayawada: నగర పోలీస్ కమీషనర్ కార్యాలయ ప్రాంగణంలో 'హరితాంధ్రప్రదేశ్' మొక్కల పెంపకం కార్యక్రమం. మొక్కలు నాటిన సీపీ ఎస్.వి. రాజశేఖర బాబు, అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 29 Aug 2026 2:12 PM IST
Vijayawada
X

Vijayawada: పోలీస్ కమిషనరేట్‌లో 'హరితాంధ్రప్రదేశ్' మొక్కలు నాటిన రాజశేఖర బాబు

Vijayawada: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "హరితాంధ్రప్రదేశ్" కార్యక్రమంలో భాగంగా నగర పోలీస్ కమీషనర్ గారి కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్. గారు,అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసి, కార్యాలయ ప్రాంగణంలో స్వయంగా మొక్కలు నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని కోరారు. పోలీస్ శాఖ తరఫున శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వామ్యం కావాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ గారితో పాటు అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, ఎ.ఆర్.డి.సి.పి. శ్రీ బి.సత్యనారాయణ గారు, ఎ.ఆర్.ఎ.డి.సి.పి. శ్రీ ఎన్.వి.రమణ గారు, ఎ.ఆర్.ఎ.సి.పి.లు శ్రీ రామకృష్ణం రాజు గారు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యాలయ ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటారు. నాటిన మొక్కల సంరక్షణను బాధ్యతగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story