Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆశ్వయుజ పౌర్ణమి గిరి ప్రదక్షిణ!
Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆశ్వయుజ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆశ్వయుజ పౌర్ణమి గిరి ప్రదక్షిణ!
Indrakeeladri: ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండిత ఉవాచ.
ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభంకాగా.
ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయకోలాట నృత్యప్రదర్శనలు, భజన సంకీర్తనా
గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్ణయించిన మార్గంలో సాగింది.
ఘాట్ రోడ్ శ్రీ అమ్మవారి గుడి,కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరిప్రదక్షిణ కొనసాగనుంది.
శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన వాహనం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లోస్థానిక మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు,కొబ్బరికాయలు సమర్పించి, జయ జయద్వానాలు చేశారు.
గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు శ్రీ అమ్మవారి కుంకుమ, ప్రసాదంను భక్తులకు దేవస్థానం నుండి అందజేయడమైనది. వేలాది మంది భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, సూపరెండెంట్ హేమ దుర్గాంబ, సీనియర్ అసిస్టెంట్ శిరీష తదితరులు పాల్గొన్నారు.




