Vijayawada: ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ!
Vijayawada: కార్తీక మాసం సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు, క్యూ లైన్లను దేవస్థానం ఈఓ వికె శీనా నాయక్ శనివారం ఉదయం పరిశీలించారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ!
Vijayawada: కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ కనకదుర్గ అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరణకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లను ఈరోజు ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికె శీనా నాయక్ పరిశీలన చేశారు.
అన్నప్రసాదం క్యూ లైన్, భోజన వితరణ ప్రదేశం, భక్తులు వేచి ఉండే ప్రదేశంను ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ రాఘవ రాజు, శ్రీ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమ తదితరులు పాల్గొన్నారు.




