Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు పరిశీలించిన కన్నబాబు
Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కార్యదర్శి కే. కన్నబాబు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు పరిశీలించిన కన్నబాబు
Indrakeeladri: శనివారం సాయంత్రం దేవాదాయశాఖ కార్యదర్శి కే. కన్నబాబు ఇంద్రకీలాద్రి పై ఏర్పాట్లు పరిశీలన చేశారు. టోల్ గేట్ నుండి క్యూ లైన్లు,భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలన చేశారు.యాక్సిస్ గేట్ల పని తీరు గురించి వివరాలు తెలుసుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనం చేసుకొని మిగతా ప్రాంతాలు పరిశీలన చేసారు.
ఈ కార్యక్రమం లో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో వికె శీనా నాయక్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.




