Vijayawada: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు!

Vijayawada: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు మహిళా నేతలు, కార్యకర్తలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Aug 2026 10:35 PM IST
Vijayawada
X

Vijayawada: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు!

విజయవాడ: పవిత్ర రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ చైర్మన్ బండి పుణ్యశీల, మాజీ కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి, 50వ డివిజన్ ఇంచార్జ్ బంక విజయ, క్లస్టర్ అధ్యక్షురాలు బంక చాముండేశ్వరి, పశ్చిమ వైసిపి మహిళా అధ్యక్షురాలు పేరూరి దుర్గాభవానిలతో పాటు పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. వారంతా వెలంపల్లి శ్రీనివాసరావు చేతికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనురాగానికి, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే గొప్ప పండుగ రాఖీ పౌర్ణమి అని కొనియాడారు. తోబుట్టువుల బంధం కేవలం రక్తసంబంధానికే పరిమితం కాకుండా, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. తనపై ఆత్మీయతతో రాఖీ కట్టిన వారందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లం శివ కుమారి, ముడుపు వెంకట పద్మ, రుద్రపాటి స్రవంతి, దుర్గంబ రెడ్డి, ఉప్పాడ రాజకుమారి రెడ్డి, రవ్వ కోటేశ్వరి, బత్తిన నాగపావని తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story