Gudivada: గుడివాడలో రూ.40 కోట్లతో రోడ్ల అభివృద్ధి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము!

Gudivada: గుడివాడలో రూ.40 కోట్ల హ్యామ్ నిధులతో రోడ్ల అభివృద్ధి ఓల్డ్ బైపాస్ సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు, సవాల్.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Sept 2026 11:26 PM IST
Gudivada
X

Gudivada: గుడివాడలో రూ.40 కోట్లతో రోడ్ల అభివృద్ధి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము!

గుడివాడ సెప్టెంబర్ 28: గుడివాడ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) రూ.40 కోట్ల నిధులతో పట్టణంలో రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పాత గుడివాడలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం సాయంత్రం శంకుస్థాపనలు చేశారు.

పట్టణంలోని 11వ వార్డు రాఘవేంద్రనగర్‌, 13వ వార్డు బాపూజీనగర్‌లోని గంగానమ్మ వారి రోడ్డు తదితర ప్రాంతాల్లో కూటమి నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే రాము భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పాత గుడివాడలోని 12, 14, 15, 16, 17, 18 వార్డుల పరిధిలో ప్రధానమైన ఓల్డ్ బైపాస్ రోడ్డును రూ.2.20 కోట్లతో సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. కోతి బొమ్మ సెంటర్‌ నుంచి బంటుమిల్లి రోడ్డు వరకు చేపట్టనున్న ఈ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాము శంకుస్థాపన చేశారు.

ఆయా ప్రాంతాల్లో స్థానిక మహిళలు, ప్రజలతోనే ఎమ్మెల్యే రాము భూమిపూజ చేయిస్తూ వారిని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. దశాబ్దాలుగా తమ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల సమస్యకు పరిష్కారం లభించనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ‘థాంక్యూ రామన్న.. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు.

ఎన్నో ఏళ్లుగా రోడ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్న తమ ప్రాంతాలకు కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వకుండా, ఇప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతున్నందుకు ఎమ్మెల్యే రాముకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారులన్నింటినీ ఎండ్‌టు ఎండ్‌ అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి దుమ్ములేని గుడివాడ రోడ్లను చూడాలన్నదే తన లక్ష్యమన్నారు.

కోతి బొమ్మ సెంటర్‌ నుంచి బంటుమిల్లి రోడ్డు వరకు రూ.2.20 కోట్లతో ఓల్డ్ బైపాస్ సీసీ రోడ్డు నిర్మిస్తున్నామని, దీనితో పాటు పట్టణంలోని ప్రధాన రహదారులన్నింటినీ దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

“గుడివాడ రోడ్ల సమస్యకు పరిష్కారం చూపేందుకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు” అని రాము అన్నారు.

చిన్నతనం నుంచి గుడివాడ రోడ్లను దుమ్ముతో నిండిన పరిస్థితుల్లోనే చూస్తూ వచ్చానని, ఎప్పటికైనా ఈ పరిస్థితి మారుతుందా అని ఆలోచించేవాడినని చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గుడివాడలో మార్పు కనిపిస్తుండటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

గుడివాడ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పట్టణంలో రోడ్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని, రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రాము తెలిపారు. గుడివాడకు శాశ్వతంగా ఉపయోగపడే మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు.

తనపై ప్రతిపక్షాలు, కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోనని రాము స్పష్టం చేశారు. సమావేశాలు పెట్టుకుని ప్రసంగాలు చేసినా, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు.

“నాపై విమర్శలు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలన్నారు. నేను రాజకీయ నాయకుడిగా మాత్రమే పనిచేయాలని అనుకోవడం లేదన్నారు. గుడివాడకు మార్పు తీసుకొచ్చే సంస్కర్తగా పనిచేయాలన్నదే నా సంకల్పం అని ఉద్ఘాటించారు.ప్రజలకు మంచి చేయడమే నా లక్ష్యం” అని రాము అన్నారు.

చేతకాని వ్యక్తుల మాటలను పట్టించుకుంటే ప్రజలకు చేయాల్సిన పనులకు ఆటంకం కలుగుతుందని, అందుకే విమర్శలను పక్కనపెట్టి అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్నానని తెలిపారు.

గతంలో 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలు 53 వేల ఓట్ల తేడాతో తిరస్కరించిన వ్యక్తులు ఇప్పుడు మైకులు పట్టుకుని పిచ్చివాగుడు వాగుతున్నారని రాము ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం గుడివాడ పరువు తీసేలా మాట్లాడుతున్న వ్యక్తులను చూస్తుంటే జాలేస్తోందన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితిలో కొందరు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని రాము ఆరోపించారు. “గొడ్డలి పార్టీ అధినేత చెప్పినట్లు అభ్యర్థులు దొరకకపోతే.. గడ్డం గ్యాంగ్ అధినేత చైర్మన్‌గా పోటీ చేస్తే స్వాగతం” అని సవాల్ విసిరారు.

“ఆయన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే 30 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని ఛాలెంజ్ చేస్తున్నా” అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రకటించారు.

రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా గుడివాడ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాము స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు అందేలా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

“నా దృష్టిలో రాజకీయాల కంటే గుడివాడలో చేంజ్ తీసుకురావడమే ముఖ్యమన్నారూ. ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి గుడివాడ రూపురేఖలు మార్చడమే నా సంకల్పం” అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో కమీషనర్ సింహాద్రి మనోహర్, ఎంఈ సతీష్ చంద్ర, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టిడిపి నాయకులు లింగం ప్రసాద్, గోర్జి సత్యనారాయణ, దింట్యాల రాంబాబు,గుత్తా చంటి,షేక్ జానీ,నిమ్మగడ్డ సత్యసాయి,సయ్యద్ జబిన్,కంచర్ల సుధాకర్,వేశపోగు ఇమ్మానుయేలు, యార్లగడ్డ సుధారాణి, మరీదు కరుణ,రోహిణి,

గుడివాడ జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ నాయకులు సాయన రాజేష్,వేమూరి త్రినాథ్, గుండు వెంకట్రావు, పడాల పూర్ణ, కోసూరి ఆంజనేయులు, ఇమ్మిడిశెట్టి భాను, పరుచూరి రాజేష్, బెల్లివాడ పవన్, నిళ్ల సాయి, తోట సతీష్, Don చందు, యలవర్తి సాయి పడాల సౌమ్య, టిడిపి నాయకులు మహమ్మద్ రఫీ,షేక్ మౌలాలి,నిరంజన్ రోహిణి అల్లాడ శ్రీనివాస్, వసంతవాడ దుర్గారావు, వేమూరి సుజాత,మిక్కిలినేని రమేష్ చౌదరి,గడ్డం ప్రకాష్ దాస్,ఏసు పాదం,

మెరుగు మోజేష్,కనకాంబరం,లారా,గుడివాడ జనసేన నాయకులు, వేమూరి త్రినాథ్, గుండు వెంకట్రావు, పడాల పూర్ణ, కోసూరి ఆంజనేయులు, ఇమ్మిడిశెట్టి భాను, పరుచూరి రాజేష్, బెల్లివాడ పవన్, నిళ్ల సాయి, తోట సతీష్, Don చందు, యలవర్తి సాయి మరియు వీరమహిళ పడాల సౌమ్య మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఆయా అవార్డుల పరిధిలోని కుటుంబ నాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.