Vijayawada: దుర్గా ఘాట్‌లో విజయవంతంగా హంస వాహనం (తెప్పోత్సవం) ట్రయల్ రన్!

Vijayawada: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం కోసం దుర్గా ఘాట్ వద్ద హంస వాహనం ట్రయల్ రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్, సీపీ, ఈవో పర్యవేక్షించారు.

Satyanarayana, Vijayawada
Published on: 18 Oct 2026 12:01 PM IST
Vijayawada
X

Vijayawada: దుర్గా ఘాట్‌లో విజయవంతంగా హంస వాహనం (తెప్పోత్సవం) ట్రయల్ రన్!

Vijayawada: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గా ఘాట్‌ వద్ద హంస వాహనం (తెప్పోత్సవం) ట్రయల్ రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్‌తో పాటు స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ, వివిధ శాఖల ఆధికారులు పరిశీలించారు.

హంస వాహనం నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు, భద్రతా చర్యలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను అధికారులు సమీక్షించారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై దృష్టిసారించారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada