Tiruvuru: హైవేపై భారీ వృక్షాలు.. తిరువూరులో గాలివాన బీభత్సం!

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రాత్రి సంభవించిన భారీ గాలివాన వల్ల జరిగిన నష్టాల వివరాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Jun 2026 8:10 AM IST
Tiruvuru
X

Tiruvuru: హైవేపై భారీ వృక్షాలు.. తిరువూరులో గాలివాన బీభత్సం!

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులకు తోడు భయంకరమైన పిడుగుల శబ్దాలకు పట్టణ ప్రజలు హడలెత్తిపోయారు. ఇబ్రహీంపట్నం- జగదల్పూర్ వెళ్ళే (NHAI-30) జాతీయ రహదారిపై లక్ష్మీపురం వద్ద రోడ్డుపై పడిన భారీ వృక్షం.

హైవేపై ఇరువైపుల కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్. తిరువూరు-విసన్నపేట వెళ్లే దారిలో మల్లెల గ్రామం వద్ద ప్రధాన రహదారిపై పడిన మరో చెట్టు. ప్రభుత్వ ఆసుపత్రి మున్సిపల్ కార్యాలయాల వద్ద రోడ్డుపై పడిన పెద్ద చెట్టు. గత రాత్రి పట్టణంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది.

జిల్లా యంత్రాంగం అదెశాల మేరకు జేసీబీ సహాయంతో అతికష్టం మీద రాత్రి వేళ చెట్లను రెవెన్యూ పోలీస్ అధికారులు తొలగించి ట్రాఫిక్ పునరుద్దించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story