Vijayawada: సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కాగా అమలు చేయాలి: ఎస్‌ఈసీ
Vijayawada: సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.
Vijayawada: సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కాగా అమలు చేయాలి: ఎస్‌ఈసీ
Vijayawada: సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి- ఏడు జిల్లాల (వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, మార్కాపురం) కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు
రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది అందించిన సమాచారం మేరకు... సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఉత్తర్వులు అందిన వెంటనే సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, ఈ విషయంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్ఈసీ కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున, ఏడీజీపీ ఎస్. మధుసూధన రెడ్డి, ఐజీ బి. రాజకుమారి, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు అందిన తదుపరి మరియు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన నిర్ణయము తీసుకుంటుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో 7 జిల్లాల్లోని 19 మున్సిపాలిటీస్ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీస్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
మున్సిపల్ సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు సమర్పించే సమయంలో అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోలీసు శాఖను ఆదేశించారు.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా శాంతియుత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఎన్‌ఓసీ, నో డ్యూ సర్టిఫికెట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), నో డ్యూ సర్టిఫికెట్ సమర్పించాలంటూ కొందరు రిటర్నింగ్ అధికారులు (ROs), ఎన్నికల అధికారులు (EOs) నిబంధనలు విధిస్తున్నారని కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చాయి.
ఈ అంశంపై స్పష్టతనిస్తూ, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, నో డ్యూ సర్టిఫికెట్ సమర్పించాలనే నిబంధన ఎన్నికల నియమావళిలో లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అదనపు నిబంధనలు విధించకుండా, అర్హులైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.




