AP: స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ భేటీ!
AP: ఏపీలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా జనసేన పార్టీ ఐదుగురు సభ్యుల కేంద్ర సమన్వయ కమిటీతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు.
AP: స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ భేటీ!
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులతో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. జనసేన పార్టీ శ్రేణుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, దానిని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులకు నివేదించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ప్రత్యేక సమన్వయ కమిటీతో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిటీ విధివిధానాలు, బాధ్యతలు, పనితీరు, అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అందించే సహకారంపై పవన్ కళ్యాణ్ కమిటీ సభ్యులకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి కమిటీల ద్వారా సేకరించిన సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేసి, సమన్వయంతో ముందుకు సాగాలని, ఎప్పటికప్పుడు సమాచారం తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కమిటీ తదుపరి కార్యాచరణపై సోమవారం మరోసారి సమావేశమై, పూర్తిస్థాయిలో కార్యాచరణకు సన్నద్ధం కావాలని పవన్ కళ్యాణ్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులు, APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




