Indrakeeladri: ఇంద్రకీలాద్రి మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో వైభవంగా కార్తీక పూజలు!

Indrakeeladri: కార్తీక మాసం సందర్భంగా గురువారం సాయంత్రం ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, ఊయల సేవ వైభవంగా జరిగాయి.

Satyanarayana, Vijayawada
Published on: 26 Nov 2026 11:18 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: ఇంద్రకీలాద్రి మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో వైభవంగా కార్తీక పూజలు!

ఇంద్రకీలాద్రి: కార్తీక మాసం సందర్బంగా ఈరోజు సాయంత్రం ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమములు వైభవంగా జరిగాయి. ఆలయఅర్చకులు వైభవంగా పూజా క్రతువులు నిర్వహించారు.

ఈ విశేషపూజా కార్యక్రమములలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ఆలయ కార్యనిర్వహణాధికారి వికె శీనా నాయక్,ట్రస్ట్ బోర్డు మెంబెర్స్ శ్రీమతి పద్మావతి ఠాకూర్, శ్రీమతి సరిత,శ్రీ రాఘవరాజు, సహాయకార్యనిర్వహణాధికారి డాక్టర్ కే. గంగాధర్,పర్యవేక్షకులు శ్రీమతి హేమ దుర్గాంబ, సీనియర్ అసిస్టెంట్ పి. శిరీష తదితరులు పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada