Vijayawada: టీడీపీలో చేరిన ప్రముఖ న్యాయవాది కొప్పుల మోహన్!

Vijayawada: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రముఖ న్యాయవాది కొప్పుల మోహన్‌తో పాటు 50 కుటుంబాలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా సమక్షంలో టీడీపీలో చేరారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Aug 2026 3:25 PM IST
Vijayawada
X

Vijayawada: టీడీపీలో చేరిన ప్రముఖ న్యాయవాది కొప్పుల మోహన్!

Vijayawada: పశ్చిమ నియోజకవర్గం బుద్దా వెంకన్న గారి కార్యాలయం హైకోర్టు ప్రముఖ న్యాయవాది, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొప్పుల మోహన్ గారితో పాటు సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు . పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ బుద్ధా వెంకన్న గారి నాయకత్వంలో, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కే. నాగుల్ మీరా గారి సమక్షంలో, 49 వ డివిజన్ అధ్యక్షుడు శ్రీ బడుగు వెంకన్న గారి సహకారంతో కొప్పుల మోహన్ గారు మరియు ఆయనతో వచ్చిన కుటుంబాలను టీడీపీ నాయకులు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి కొప్పుల మోహన్: బుద్ధా వెంకన్న

ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ బుద్ధా వెంకన్న గారు మాట్లాడుతూ, ప్రముఖ న్యాయవాది కొప్పుల మోహన్ గారు తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మోహన్ గారు మంచి ఆశయాలు, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని, ఆయన గురించి స్థానిక ప్రజలు సైతం ఎంతో సానుకూలంగా మాట్లాడుకుంటారని కొనియాడారు.

కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మోహన్ గారి వంటి మంచి వ్యక్తి, న్యాయ పరిజ్ఞానం కలిగిన నాయకుడు టీడీపీలో చేరడం పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని బుద్ధా వెంకన్న గారు అన్నారు. న్యాయవాదిగా ప్రజా సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహన, న్యాయ పరిజ్ఞానం భవిష్యత్తులో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

టీడీపీపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ఈ చేరికలు నిదర్శనమని పేర్కొంటూ, పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తారని బుద్ధా వెంకన్న గారు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు.

సామాజిక న్యాయానికి టీడీపీ పెద్దపీట: కే. నాగుల్ మీరా

నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కే. నాగుల్ మీరా గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే సామాజిక న్యాయానికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాలు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని తెలిపారు.

ఎన్టీఆర్ హయాం నుంచే అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు టీడీపీ కృషి చేసిందని, జీఎంసీ బాలయోగి, ప్రతిభా భారతి, యనమల రామకృష్ణుడు వంటి నాయకులకు ఉన్నత పదవులు కల్పించడం అందుకు నిదర్శనమని నాగుల్ మీరా గారు పేర్కొన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తోందన్నారు. అమరావతి అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణతో పాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ప్రముఖ న్యాయవాది కొప్పుల మోహన్ గారు టీడీపీలో చేరడం పశ్చిమ నియోజకవర్గానికి ఎంతో ప్రయోజనకరమని నాగుల్ మీరా గారు అన్నారు. న్యాయవాదిగా ఆయనకు ఉన్న అనుభవం, న్యాయ పరిజ్ఞానం ద్వారా పేదలు, దళితులు, బీసీలు, మైనారిటీలు, అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి మరింతగా సేవ చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

బుద్ధా వెంకన్న గారి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగుతారని కే. నాగుల్ మీరా గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుర్రం కొండ, చిన్న సుబ్బయ్య, సురభి బాలు, పేరం సత్యనారాయణ,ఈగల సాంబ, కుంచం దుర్గారావు, అమర్ మురళి, B నందకుమారి, ఎన్. విజయలక్ష్మి, తుపాకుల రావణమ్మ, దుర్గ,కామాక్షి,బడుగు ,దీపంగి మధు,కొడవటి కంటి విక్టోరియా, బడుగు రమణ,చిట్ల నాగబాబు,ఉరివేటి నాగమోహన్,కొమ్మోజి కామాక్షి, కొరపాటి ముత్యాలరావు,దోమ తోటి శివ,కండుబోతు నరసింహారావు,పాట్నాల భార్గవి.


Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story