Vijayawada: విజయవాడ ఉత్సవ్‌కు గుజరాత్ సీఎంకు నారా లోకేష్ ఆహ్వానం
Vijayawada: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యి కోస్ట్ టు కోస్ట్ కారిడార్, గిఫ్ట్ సిటీ సహకారం, టీటీడీ ఆలయ భూ కేటాయింపులపై చర్చించారు.
Vijayawada: విజయవాడ ఉత్సవ్‌కు గుజరాత్ సీఎంకు నారా లోకేష్ ఆహ్వానం
Vijayawada: గాంధీనగర్ (గుజరాత్): గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్ లో భేటీ అయ్యారు. తీరప్రాంత రాష్ట్రాల వృద్ధి, పారిశ్రామిక నియంత్రణ సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన చర్చల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఏకతాటిపై ఉండాలని కోరారు.
పశ్చిమ తీరంలోని గుజరాత్, తూర్పు తీరంలో గేట్‌వేగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర, పోర్టుల ఆధారిత పరిశ్రమ పెద్దఎత్తున అభివృద్ధి సాధిస్తుందన్నారు.
గుజరాత్ మోడల్ సముద్ర రవాణా అభివృద్ధిలో భాగంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట నాన్-మేజర్ పోర్టులను ఏపీ అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రైవేట్ పోర్టు కన్సెషన్లు, పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ (PLID) లో ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ద్వైపాక్షిక (Coast-to-Coast) లాజిస్టిక్స్, వాణిజ్య కారిడార్ ఆవశ్యకతను మంత్రి లోకేష్ వివరించారు.
గుజరాత్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గిఫ్ట్ సిటీ ఫ్రేమ్‌వర్క్ ను ఆదర్శంగా తీసుకొని నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్, అమరావతి ప్రాంతాల్లో పెద్దఎత్తున పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి లోకేష్ చెప్పారు.
దేశంలో అంతర్జాతీయ ఆర్థిక సేవలు, ఆవిష్కరణలకు గిఫ్ట్ IFSC ల్యాండ్ మార్క్ గా నిలిచిందని కొనియాడారు. అదే తరహాలో విశాఖపట్నం, అమరావతిలో ఆధునిక బిజినెస్ డిస్ట్రిక్ట్ లను అభివృద్ధి చేయడానికి ఏపీ అమలుచేస్తున్న వ్యూహాలను వివరించారు.
గిఫ్ట్ సిటీలోని సింగిల్-విండో క్లియరెన్స్, డెవలపర్ ప్రోత్సాహకాలు, నియంత్రణ నిర్మాణాలపై ద్వైపాక్షిక పరిజ్ఞాన మార్పిడికి మద్దతు అందించాలని కోరారు. ఏపీలో సెమీకండక్టర్ & గ్రీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తూ పారిశ్రామిక సప్లయ్ చైన్ తో అనుసంధానిస్తున్నామని తెలిపారు.
గ్రీన్ హైడ్రోజన్ (కాకినాడ హబ్), పారిశ్రామిక స్మార్ట్ సిటీలు (కొప్పర్తి, ఓర్వకల్లు), టెక్నాలజీ వర్క్‌ఫోర్స్ తయారీతో ఏపీ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోందని చెప్పారు.
అక్టోబర్ 11 నుండి 20 వరకు పున్నమి ఘాట్ వేదికగా జరగనున్న విజయవాడ ఉత్సవ్ కు హాజరు కావాల్సిందిగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు.
గోదావరి పుష్కరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ 2027 గోదావరి పుష్కరాలకు రావాల్సిందిగా గుజరాత్ సీఎంను కోరారు. గుజరాత్‌లో టిటిడి ఆధ్వర్యాన శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నామని, ఇందుకు అవసరమైన భూమి కేటాయించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ వెంట రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఉన్నారు.




