Vijayawada: క్రికెట్ టోర్నమెంట్ విజేతగా తెలంగాణ స్పోర్ట్స్ టీమ్!

Vijayawada: విజయవాడ క్రికెట్ టోర్నీ విజేత తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టును క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 27 July 2026 2:36 PM IST
Vijayawada
X

Vijayawada: క్రికెట్ టోర్నమెంట్ విజేతగా తెలంగాణ స్పోర్ట్స్ టీమ్!

తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టుకు మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు....

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో తెలంగాణ స్పోర్ట్స్

విజేతగా నిలిచిన తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టు సభ్యులకు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.విజయవాడ లయోలా కాలేజీలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో 14 జట్లు తలపడగా ఫైనల్ కు తెలంగాణ జట్టు, కడప జట్టు చేరుకుంది..క్రీడా స్ఫూర్తితో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు ప్రతిభ కనబరిచి విజయం సాధించడం అభినందనీయమని మంత్రి అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు ఐక్యత, క్రమశిక్షణ, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు..భవిష్యత్తులోనూ తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టులు మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు...

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story