Indrakeeladri: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో కొలువైన కనకదుర్గమ్మను మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Satyanarayana, Vijayawada
Published on: 17 Oct 2026 11:04 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం

ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం దర్శించుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి చేరుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి

అమ్మవారి అంతరాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కు వేదాశీస్సులు అందజేశారు. ఆయను దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ తదితరులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada