Vijayawada: విజయవాడలో ఘనంగా ఆలయ పాలకమండళ్ల ప్రమాణ స్వీకారం!

Vijayawada: విజయవాడలో పాత శివాలయం, విజయేశ్వర స్వామి నూతన పాలకమండళ్ల ప్రమాణ స్వీకారం. హాజరైన ఎంపీ కేశినేని చిన్ని; దేవాలయాల అభివృద్ధికి పూర్తి సహకారం హామీ.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 27 Aug 2026 9:20 AM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడలో ఘనంగా ఆలయ పాలకమండళ్ల ప్రమాణ స్వీకారం!

Vijayawada: విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం (పాత శివాలయం), శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల/పాలకమండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న, నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణ, జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, విజయవాడ నగర చరిత్రలో పాత శివాలయానికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉందన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం ఏర్పడిన అనంతరం విజయవాడ అభివృద్ధి క్రమంగా ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ధర్మకర్తల మండలి సమకూర్చాలని సూచించారు.నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌తో పాటు సభ్యులందరికీ ఎంపీ కేశినేని చిన్ని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఆలయ అభివృద్ధికి తన వంతుగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ,ఆర్యవైశ్య సామాజిక వర్గానికి దైవభక్తితో పాటు దానధర్మాల పట్ల కూడా ఎంతో ఆసక్తి, సేవాభావం ఉందన్నారు.

ఆర్యవైశ్య పెద్దలందరినీ సమన్వయం చేసుకుని, డూండి రాకేష్ వంటి నాయకులు ప్రభుత్వ సహకారంతో పాటు సమాజ సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.రాబోయే పుష్కరాల నాటికి నిధుల కోసం ఎదురుచూడకుండా ఆలయ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగాలని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.

ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.నూతన పాలకమండలి చైర్మన్, సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య పెద్దలందరి సహకారం, భక్తుల భాగస్వామ్యంతో శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానం అంచెలంచెలుగా అభివృద్ధి చెంది మరింత వైభవాన్ని సంతరించుకోవాలని ఎంపీ కేశినేని చిన్ని ఆకాంక్షించారు.

విజయవాడలోని ఈ రెండు ప్రముఖ శైవ క్షేత్రాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పాలకమండళ్లు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. దేవాలయాల ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ వాటి అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, భక్తులు, దాతలు సమన్వయంతో ముందుకు సాగాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాత శివాలయం ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ ధనేకుల వెంకట సుబ్బారావ, ధర్మకర్తల మండలి సభ్యులు ఈది పార్వతి, కొజ్జా శేషారావు, కొట్టేటి సరిత రాజేశ్వరి, పోతిన ధర్మారావు, పోతుగుంట శాంతి,ఇప్పర్తి లక్ష్మి, అబ్బూరి నాగ శ్రీనివాస్, పత్తి శివరామకృష్ణ, ఎర్ర సునీత,నరంశెట్టి కుర్మారావు విజయేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దర్శి సీతామహాలక్ష్మి , సభ్యులు నక్క కృష్ణ,అడ్లురి శివకుమారి, చింతపల్లి సత్యనారాయణ, బండారు బాబురావు, పెల్లూరి మణిమాల,రత్నవత్ హారతి, ఎర్రంశెట్టి విశ్వేశ్వరరావు, ఆలమూరు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story