Vijayawada: చట్టసభలు, ఉద్యోగాల్లో బీసీల వాటా 50 శాతం ఉండాల్సిందే!
Vijayawada: విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది.
Vijayawada: చట్టసభలు, ఉద్యోగాల్లో బీసీల వాటా 50 శాతం ఉండాల్సిందే!
Vijayawada: ఈరోజు విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల హక్కులు, భవిష్యత్తు కార్యాచరణపై అత్యంత కీలకమైన సర్వసభ్య సమావేశం విజయవంతంగా జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుండి వందలాది మంది బీసీ సంఘాల ముఖ్య నాయకులు, యువజన ప్రతినిధులు మరియు మేధావులు భారీ సంఖ్యలో "ఈ మహాసభలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి దిశానిర్దేశం చేశారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు చల్లా అనుదీప్ కుమార్ ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశంలో మరియు రాష్ట్రంలో మెజారిటీ జనాభా కలిగిన బీసీలకు చట్టసభల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో ఆశించిన స్థ.




