Vijayawada: విజయవాడ ముత్యాలంపాడులో ఘనంగా సాయిబాబా పుణ్యతిధి వేడుకలు!
Vijayawada: విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఈనెల 11 నుంచి 21 వరకు షిర్డీసాయిబాబా 108వ పుణ్యతిధి మహోత్సవాలు. కరపత్రం ఆవిష్కరించిన గౌరవాధ్యక్షులు గౌతంరెడ్డి.
Vijayawada: విజయవాడ ముత్యాలంపాడులో ఘనంగా సాయిబాబా పుణ్యతిధి వేడుకలు!
విజయవాడ: ఆంధ్రాషిర్డీగా విరాజిల్లుతున్న ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో ఈనెల 11వ తేదీ ఆదివారం నుండి 21వ తేదీ బుధవారం వరకు షిర్డీసాయినాధుని పుణ్యతిధి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు.స్ధానిక ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో గురువారం షిర్డీసాయినాధుని 108వ పుణ్యతిధి మహోత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని కమిటీ సభ్యులతో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి గౌతంరెడ్డి మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ ఆదివారం బాబావారికి గోక్షీరముతో అభిషేకం, లోక కల్యాణార్ధం సాయినాధ ఆదిత్యహోమం జరుగుతాయన్నారు.
12వ తేదీన క్షీరము, పెరుగుతో అభిషేకం, సాయినాధ-రుద్రహోమం, 13న క్షీరము, ఆవునెయ్యితో అభిషేకం, సాయినాధ- సుబ్రహ్మణ్యం హోమం,
14న క్షీరము, తేనెతో అభిషేకం, సాయినాధ- గణపతి హోమం, 15న క్షీరము, పంచదారతో అభిషేకం, సాయినాధ- దత్తాత్రేయ హోమం, 16న క్షీరము, చెరుకురసంతో అభిషేకం,సాయినాధ- లక్ష్మీనారాయణ హోమం, 17న క్షీరము, కొబ్బరినీరుతో అభిషేకం, సాయినాధ- మృత్యుంజయ హోమం, 18న క్షీరము వట్టి వేర్లుతో అభిషేకం, సాయినాధ- నవగ్రహాలు హోమం, 19న క్షీరము,గంధంతో అభిషేకం.. సాయినాధ- దక్షిణామూర్తి హోమం, 20వ తేదీన క్షీరము.. విభూదితో అభిషేకం, సాయినాధ- ఆంజనేయ హోమం, 21వ తేదీన క్షీరము..పంచామృతములతో అభిషేకం.మద్యాహ్నం బాబావారి సమాధి నమూనా అలంకరణ,విశేష భజనలు హారతి కూచిపూడి నృత్య ప్రదర్శనలు,జరుగుతాయని తెలిపారు. 22వ తేదీ గురువారం మద్యాహ్నం 12.30 గంటలకు అన్నప్రసాద వితరణ సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ జరుగుతుందన్నారు.
ప్రతీ రోజు ఉదయం ఆరున్నర గంటలకు పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం,సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు షిర్డీసాయినాధుని పుణ్యతిధి మహోత్సవాలలో పాల్గొని బాబావారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆయన కోరారు.
ఈ షిర్డీసాయినాధుని 108వ పుణ్యతిధి మహోత్సవాలలో సాయి సేవకులతో నయన మనోహరంగా పల్లకి ఉత్సవం జరుపబడుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందాలని అన్నారు. కార్యక్రమంలో మందిర కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, అర్చకులు కె బాలాజీ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




