Vijayawada: సీఎం చంద్రబాబును కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు!

Vijayawada: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై చర్చ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Aug 2026 10:56 PM IST
Vijayawada
X

Vijayawada: సీఎం చంద్రబాబును కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు!

విజయవాడ: విజయవాడలో గురువారం సాయంత్రం తెలుగుదేశంj పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ముఖ్యమంత్రి గారితో చర్చించారు. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి మరియు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత సమన్వయంతో పనిచేస్తామని సుగవాసి ప్రసాద్ బాబు గారు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story