Vijayawada: ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి ప్రమాదవశాత్తు యువకుడు దుర్మరణం!

Vijayawada: పెనమలూరు మండలం కానూరులో విద్యుత్ షాక్‌తో గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి దుర్గారావు మృతి. కామయ్యతోపు వద్ద విషాదం.

Ramana, Penamaluru
Published on: 21 Aug 2026 12:27 PM IST
Vijayawada
X

Vijayawada: ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి ప్రమాదవశాత్తు యువకుడు దుర్మరణం!

Vijayawada: పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన గోగులమూడి మురళీ కృష్ణ (38) అనే వ్యక్తి యొక్క తమ్ముడు అయినా గోగులమూడి దుర్గా రావు (36), గన్నవరం విమానాశ్రయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూనే ఖాళీ సమయంలో పెయింటింగ్ పనులకు వెళ్లేవాడు, అతనికి ఇంకా వివాహం కాలేదు దుర్గా రావు, 19.08.2026 ఉదయం పెయింటింగ్ పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాడు.

రాత్రి సుమారు 9:00 గంటల ప్రాంతంలో తన ఇంటి నుండి కామయ్యతోపు సెంటర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, కామయ్యతోపు సెంటర్‌లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న 33/11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రమాదవశాత్తు తాకాడు. దీంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలినాడు. చుట్టుపక్కల వారు అతనిని హాస్పిటల్ కి తరలించగా మృతి చెందినట్లు చెప్పినారూ.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story