Vijayawada: విజయవాడలో కూలిన రిటైనింగ్ వాల్ పరిశీలించిన వెలంపల్లి!
Vijayawada: విజయవాడ 45వ డివిజన్‌లో కూలిన రిటైనింగ్ వాల్‌ను పరిశీలించిన వెలంపల్లి. కొండ ప్రాంత ప్రజల కోసం తక్షణమే నడక మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్.
Vijayawada: విజయవాడలో కూలిన రిటైనింగ్ వాల్ పరిశీలించిన వెలంపల్లి!
Vijayawada: విజయవాడ పశ్చిమలోని 45వ డివిజన్, కొండ బడి ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే రిటైనింగ్ వాల్ నానిపోయి హఠాత్తుగా కూలిపోయింది. గోడ కూలడంతో మట్టి, రాళ్ళు మార్గానికి అడ్డంగా పడి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధిత ప్రజలను కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు భరోసా కల్పించారు.
అనంతరం ఆయన మున్సిపల్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధప్రాతిపదికన శిథిలాలను తొలగించి, పటిష్టమైన కొత్త రిటైనింగ్ వాల్‌ను తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొండ ప్రాంత ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే శాశ్వత నడక మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రజలతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు సరగడ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




