Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లపై వీహెచ్‌పీ కీలక డిమాండ్లు!

Vijayawada: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలపై విహెచ్‌పీ డిమాండ్లు హుండీ నిధుల దుర్వినియోగం ఆపాలి.. అన్యమతస్థులకు విధులు కేటాయించొద్దు మాస్టర్ ప్లాన్ బహిర్గతం చేయాలి.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Sept 2026 11:42 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లపై వీహెచ్‌పీ కీలక డిమాండ్లు!

విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యాలు, ఆలయ పరిరక్షణ మరియు పారదర్శకతకు సంబంధించిన పలు అంశాలపై విశ్వ హిందూ పరిషత్ ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు మరియు ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేసింది.

హుండీ నిధుల వినియోగం దసరా నవరాత్రుల విధుల్లో పాల్గొనే వివిధ ప్రభుత్వ శాఖలకు అమ్మవారి హుండీ ఆదాయం నుంచి చెల్లింపులు చేయడాన్ని నిలిపివేయాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఆయా శాఖలకు నేరుగా నిధులు విడుదల చేయాలి. గుణదల మేరీమాత ఉత్సవాలు, రొట్టెల పండుగ వంటి ఇతర ఉత్సవాలకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో, హిందూ దేవాలయ హుండీ నిధులను ఈ విధంగా వినియోగించడం సముచితం కాదని విశ్వ హిందూ పరిషత్ పేర్కొంది.

ఉత్సవాల విధుల్లో సిబ్బంది నియామకం ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రి ఉత్సవాల విధుల్లో నియమించే సిబ్బందిలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులకు విధులు కేటాయించరాదని విశ్వ హిందూ పరిషత్ కోరింది.

మాస్టర్ ప్లాన్ బహిరంగ పరచాలి ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ పేరుతో పాత కట్టడాలు, గోశాలలు తొలగించినప్పటికీ, ఇప్పటివరకు ఆ మాస్టర్ ప్లాన్‌ను పాలకమండలి లేదా భక్తుల ముందుకు తీసుకురాలేదని పేర్కొంది. గత పదేళ్లుగా కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో, మాస్టర్ ప్లాన్‌ను వెంటనే బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

ఆక్రమణల తొలగింపు ప్రకాశం బ్యారేజీ నుంచి అర్జున వీధి మీదుగా ఆలయ ప్రధాన ముఖద్వారానికి వచ్చే భక్తుల రహదారిపై జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించి, భక్తులకు నేరుగా రాకపోకలు సులభంగా ఉండేలా మార్గాన్ని పునరుద్ధరించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.