Vijayawada: అక్కన్న మాదన్న గుహల్లో కిరాతార్జున శాసన స్తంభం పరిశీలన!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న అక్కన్న మాదన్న గుహలలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఆదివారం పరమేశ్వరుణ్ణి దర్శించుకుని కిరాతార్జున శాసన స్తంభంను పరిశీలించారు.

Satyanarayana, Vijayawada
Published on: 15 Nov 2026 4:08 PM IST
Vijayawada
X

Vijayawada: అక్కన్న మాదన్న గుహల్లో కిరాతార్జున శాసన స్తంభం పరిశీలన!

విజయవాడ: ఇంద్రకీలాద్రి దిగువన కనకదుర్గ నగర్‌లో ఉన్న చారిత్రాత్మక అక్కన్న మాదన్న గుహలలో కొలువుదీరిన పరమేశ్వరుణ్ణి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆదివారం ఉదయం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

​అనంతరం చైర్మన్, ఈవో ఇంద్రకీలాద్రి ప్రాచీన చరిత్రను వివరించే అరుదైన 'కిరాతార్జున శాసన స్తంభం'ను క్షుణ్ణంగా పరిశీలించారు. గుహల లోపల ఉన్న చారిత్రక కుడ్య చిత్రాలను, శిల్ప సంపదను ఆసక్తిగా సందర్శించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రాచీన 'పాశుపతాలయం'కు, ఈ కిరాతార్జున శాసన స్తంభానికి గల చారిత్రక నేపథ్యం మరియు పురాణ సంబంధం గురించి వారు అడిగి తెలుసుకున్నారు.

​ఇంద్రకీలాద్రి క్షేత్ర చరిత్రలో అత్యంత కీలకమైన పాశుపతాలయం విశిష్టతను, ఈ చారిత్రక ఆధారాల వివరాలను దేవాదాయ శాఖ ఉన్నత యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి వివరిస్తామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada