Vijayawada: కూటమి ప్రచార హోరు వంగవీటి రాధాకృష్ణకు ఆకుల రామకృష్ణ మద్దతు

Vijayawada: విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మద్దతుగా ఆకుల రామకృష్ణ, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమా విస్తృత ప్రచారం చేశారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 27 Oct 2026 1:56 PM IST
Vijayawada
X

Vijayawada: కూటమి ప్రచార హోరు వంగవీటి రాధాకృష్ణకు ఆకుల రామకృష్ణ మద్దతు

Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరుపున పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ ను వారి ఎన్నికల కార్యాలయంలో కలిసి, భారీ మెజార్టీతో గెలవాలని, ఆశీర్వదించిన రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ. వంగవీటి రాధాకృష్ణ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ రాష్ట్ర కాపు జే ఏ సి నాయకులు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి, ఉద్యమనేత ఆకుల రామకృష్ణ, రాష్ట్ర కాపు జే ఏ సి నాయకులు ఆరేటి ప్రకాష్, వాసిరెడ్డి ఏసుదాసు, ఎన్. ఎస్. రాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న 60వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న నెల్లి బండ్ల బాలస్వామి తరపున, 81 డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న పందిరి నాగమణి వాసు తరపున, 85వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న వంటే వెంకటేశ్వరరావు తరపున, విజయవాడ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

విజయవాడలో ఏ.పీ.యూ. డబ్ల్యూ. జె (ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్) ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశంలో ఆకుల రామకృష్ణ, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వం అస్తవ్యస్త పరిపాలన చేసిందని, చెత్త పై కూడా పన్ను వేసిందని, పరిశ్రమలను లేకుండా చేసిందని, ల్యాండ్ టైటిల్ డిడి యాక్టు పెట్టి మన పొలాలు మన స్థలాలు మనకు కాకుండా చేసే ప్రయత్నం చేసిందని, అరాచకం సృష్టించిందని, పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని,

అన్నా క్యాంటీన్ లను మూసివేసిందని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తుందని, పోలవరం ప్రాజెక్టును అటకెక్కించిoదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పడిందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, పాలనా వ్యవస్థలను గాడిలో పెట్టారని, గతంలో పంచాయతీ వ్యవస్థ 27 స్థానంలో ఉండేదని, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థని భారత దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపారని,

2024 వ సంవత్సరంలో 13,625 పంచాయతీలకు ఒకే రోజున గ్రామసభలు ఏర్పాటు చేశారనీ, 2025, 2026 వ సంవత్సరంలో కూడా గ్రామసభలు ఏర్పాటు చేసి కేంద్రం నుండి అనేక నిధులు తీసుకువచ్చి, పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టారని, మున్సిపాలిటీలను పి నారాయణ బలోపేతం చేశారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అనేక రోడ్లు వేశారని, రైతులకు సకాలంలో డబ్బులు జమ చేస్తున్నారని,

అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారని, అటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కాపు జే ఏ సి నాయకుడు కోరారు. ఈ కార్యక్రమంలో రవిరామ్ టీవీ చానల్స్ చైర్మన్ చింతల రామారావు (బాబి), చింతల రవి కుమార్ (చంటి) వాసిరెడ్డి జ్యోతి బాబు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA