Vijayawada: వైభవంగా 'యువత భవితకు భరోసా' భారీ యువజన ర్యాలీ
Vijayawada: విజయవాడలో ఘనంగా 'యువత భవితకు భరోసా' ర్యాలీ. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులతో కలిసి పాల్గొన్న టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ.
Vijayawada: వైభవంగా 'యువత భవితకు భరోసా' భారీ యువజన ర్యాలీ
మాచవరం: మాచవరం SRR & CVR ప్రభుత్వ ఇంటర్ & డిగ్రీ కళాశాల వద్ద నుండి BSNL సిగ్నల్ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఐటీ & విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సూచనల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ సుమారు 4,000 మంది ప్రభుత్వ కళాశాలల జెంజీ విద్యార్థులతో "యువత భవితకు భరోసా" భారీ ర్యాలీ నిర్వహించారు...
ఈ సందర్భంగా బొండా సిద్దార్ధ మాట్లాడుతూ :- రాష్ట్రంలోని యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని, డీఎస్సీ మెగా నోటిఫికేషన్ ద్వారా 16,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, ఐటీ రంగంలో ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా యువతకు వారి సొంత రాష్ట్రంలోనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి మరిన్ని ప్రముఖ ఐటీ సంస్థలు, భారీ పెట్టుబడులను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని, రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
అయితే యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంటే వైసీపీ మాత్రం రాజకీయ విమర్శలు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు పాల్పడుతోందని, విశాఖలో జరిగిన ఘటనలు, డీఎస్సీ నియామక ప్రక్రియపై చేస్తున్న ఆరోపణలు, బందర్ రోడ్డులో ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఘటనలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
పారదర్శకంగా జరుగుతున్న డీఎస్సీ నియామక ప్రక్రియపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. నారా లోకేష్ గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో వైసీపీ చేస్తున్న రాజకీయ ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఇలాంటి రాజకీయాలతో యువతను తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పార్టీ అధిష్ఠానం సూచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారని, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యా రంగం అభివృద్ధి, ఐటీ రంగంలో పెట్టుబడుల సాధనకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.




