Vijayawada: డీఆర్వో శ్రీదేవి పట్ల అనుచిత ప్రవర్తనపై విచారణ జరపాలి!
Vijayawada: ఏలూరు జిల్లా డీఆర్వో మర్రి శ్రీదేవి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్ చేసింది.
Vijayawada: డీఆర్వో శ్రీదేవి పట్ల అనుచిత ప్రవర్తనపై విచారణ జరపాలి!
విజయవాడ: భాధ్యతలు నిర్వర్తించే విధం గా ప్రభుత్వం అదేశాలువ్వాలని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ డిమాండ్ చేసారు.
సోమవారం విజయవాడ లొ ఆయన విడుదల చేసిన ప్రకటన లో దామాషా ప్రకారం 25 శాతం ఉన్న కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరుకాపు ఉద్యోగులకు వేధింపులు లేకుండా తమ విధులు కొనసాగే విధం గా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చందు జనార్దన్ డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లా డి ఆర్ ఓ మర్రి శ్రీదేవి గారి పట్ల ఉన్నతాధికారి దురుసుగా ప్రవర్తించడం దుర్భాష లాడటం పట్ల ఆంధ్రజ్యోతి లో వచ్చిన కథనం లో చాలా ఆవేదనతో కూడిన కథనం రావడం,గౌరవ కుటుంబ సభ్యురాలు డిఆర్ ఓ మర్రి శ్రీదేవి గారు సెలవు పై వెళ్లడం పట్ల రాష్ట్ర కాపు జే ఏ సీ తీవ్రం గా ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని,డీఆర్ ఓ గారి విధులు నిర్వర్తించే విధంగా శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ సంఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారి దృష్టికి మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్ తెలిపారు.




