Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు!
Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు!
విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి సతీసమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆలయ మర్యాదలతో ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరివేష్టం అలంకరించిన స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ. పట్టువస్త్రాలు, సారెతో సతీసమేతంగా ఆలయంలోకి వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు.
సీఎం పట్టు వస్త్రాల సమర్పణ సమయంలోనూ కొనసాగిన సామాన్య భక్తుల దర్శనాలు. ముఖ మండపం వరుస మినహా ఇతర 4 క్యూలైన్లల్లోనూ యధాతథంగా కొనసాగుతున్న దర్శనాలు.
పండితుల వేద మంత్రాల నడుమ అమ్మవారి అంతరాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు దంపతులు.




