Vijayawada: ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్వచ్ఛథాన్ - 2026’ టీ-షర్టులు ఆవిష్కరణ

Vijayawada: విజయవాడలో ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్వచ్ఛథాన్-2026’ టీ-షర్టులను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. అక్టోబర్ 2న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర మారథాన్ నిర్వహణ.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 29 Sept 2026 7:44 PM IST
Vijayawada
X

Vijayawada: ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్వచ్ఛథాన్ - 2026’ టీ-షర్టులు ఆవిష్కరణ

విజయవాడ: విజయవాడ అంబేద్కర్ కళావేదిక వద్ద మంగళవారం ఉదయం ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్వచ్ఛథాన్ - 2026’టీ-షర్ట్స్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

విజయవాడలో అక్టోబర్ 2న స్వచ్ఛ దివస్ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే“స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో “స్వచ్ఛథాన్–2026”మారథాన్ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అమరావతి రన్నర్స్ కన్వీనర్ రమేష్ రావి, మారథాన్ టైటిల్ స్పాన్సర్ హెచ్.డి.ఎఫ్.సీ. బ్యాంకు ఏపీ హెడ్(ఆపరేషన్స్) పవన్ తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.