Vijayawada: విజయవాడ సీపీ రాజశేఖర బాబుకు రాఖీ కట్టిన అడ్మిన్ డీసీపీ సరిత!
Vijayawada: రక్షాబంధన్ సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబుకు అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత, మహిళా అధికారులు, విద్యార్థినులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Vijayawada: విజయవాడ సీపీ రాజశేఖర బాబుకు రాఖీ కట్టిన అడ్మిన్ డీసీపీ సరిత!
విజయవాడ: పవిత్రమైన రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని ఈ రోజు నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. గారికి అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత, ఐ.పి.ఎస్. గారు రాఖీ కట్టి, హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అడ్మిన్ డి.సి.పి. గారితో పాటు పలువురు మహిళా పోలీస్ అధికారులు, వివిధ స్కూల్ విద్యార్థినీలు కమీషనర్ గారికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ రాఖీ పండుగ అనేది సోదరభావానికి, ఒకరికొకరు తోడుగా ఉంటామనే నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు.
నగరం లోని మహిళలందరి భద్రతకు, రక్షణకు నగర పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని అభయం ఉంటుందని తెలిపారు. రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మహిళా అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు మరియు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని పలువురు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




